Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక
- October 19, 2026 / 06:00 PM ISTByPhani Kumar
‘రణబాలి’ సినిమా సక్సెస్ తో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న(Rashmika Mandanna) మంచి జోష్లో ఉన్నారు. ఎక్కడ చూసినా వీళ్ళే కనిపిస్తున్నారు. రెస్ట్ లేకుండా తమ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక కాంబోలో వచ్చిన 3వ సినిమా ఇది. అలాగే పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి సినిమా కావడంతో.. ‘రణబాలి’ ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. ‘రణబాలి’కి విజయ్ దేవరకొండ నటన హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ పాత్ర.. తన గత సినిమాల్లోని పాత్రలకి పూర్తి భిన్నంగా ఉంటుంది.
Rashmika Mandanna

విజయ్ దేవరకొండ తన ఇమేజ్ ని పక్కన పెట్టి చేసిన సినిమా ఇది. నటుడిగా విజయ్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడంతో పాటు, ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడని చెప్పాలి. ఇదిలా ఉండగా.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ తన భార్య రష్మిక కలిసి పాల్గొన్నాడు. హైదరాబాద్, ట్యాంక్ బండ్ సమీపంలో సద్దుల బతుకమ్మ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో విరోష్ జంట స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది అని చెప్పాలి.
అలాగే అక్కడి వారితో కలిసి బతుకమ్మ ఆడింది రష్మిక. అనంతరం.. “పెళ్ళైన తర్వాత ఫస్ట్ విజ్జు(విజయ్ దేవరకొండ) వచ్చి పెళ్లి తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని రష్మికకు తాను ముందే చెప్పానని విజయ్ దేవరకొండ వచ్చి బతుకమ్మ ఎక్కడ పెద్దగా చేస్తే అక్కడికి తీసుకెళ్తా.. అక్కడ నువ్వు బతుకమ్మ ఆడాలి అని అడిగాడు. అప్పుడే మాటిచ్చాను. తెలంగాణ కోడలు అయ్యాక బతుకమ్మ ఆడటానికి ఇక్కడికి వచ్చాను” అంటూ రష్మిక తెలిపారు.
అలాగే ” నాకు బతుకమ్మ చూస్తే ఎంతో ముద్దుగా అనిపిస్తుంటుంది. ఇన్నేళ్ళు నేను ఈ వేడుకలకి రాలేకపోయాను. మగవాళ్ళు డాన్స్ చేయరు కాబట్టి..! అందుకే ఫిబ్రవరిలో పెళ్ళైన వెంటనే.. అంటే మార్చి నెలలో నేను రష్మికకి చెప్పాను. తెలంగాణాలో ఎక్కడ బతుకమ్మ పెద్దగా చేస్తే అక్కడికి నిన్ను తీసుకెళ్తాను. నువ్వు అక్కడ బతుకమ్మ ఆడాలి అని రష్మికకి చెప్పాను. చెప్పనట్టే ఇక్కడికి తనని తీసుకొచ్చాను. మా సినిమా రిలీజ్ అయ్యాక ఇలా అందరితో దసరా సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది” అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.















