Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

విజయ్‌ దేవరకొండ – రష్మిక మందనకు ఇటీవల ఎంగేజ్‌మెంట్‌ జరిగింది అని వార్తలొచ్చాయి. ఆ ఇద్దరి సన్నిహితులు కూడా ఈ విషయంలో అవును అనే చెప్పారు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో రష్మిక ఇన్‌డైరెక్ట్‌గా తన ఎంగేజ్మెంట్‌ రింగ్‌ ఇదే అంటూ చూపించేసింది. ‘గర్లఫ్రెండ్‌’ సక్సెస్‌ మీట్‌కి వచ్చి విజయ్‌ దేవరకొండ ప్రేమగా, ముద్దుగా రషి అని పిలిచి ఎంగేజ్మెంట్‌ అనుమానాలు తీర్చేశాడు. అయితే ఏమైందో ఏమో ఇద్దరూ ఇంకా దీనిపై అఫీషియల్‌ ప్రకటన చేయలేదు. అయితే లీకుల ప్రకారం వీరి పెళ్లి ఫిబ్రవరిలో జరగనుంది.

Rashmika

ఇటీవల మీడియా ముందుకు వచ్చిన రష్మికను పెళ్లి డేట్‌ గురించి అడిగితే విచిత్రమైన సమాధానం ఇచ్చింది. ఒక హాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక తన పెళ్లి వార్తలపై స్పందించింది. ఆ రూమర్స్‌ను ఖండించలేనని చెప్పిన ఆమె. అలాగని కన్‌ఫామ్‌ చేయలేను అని తేల్చేసింది. నేను ఈ వార్తలను ఇప్పుడే ధ్రువీకరించలేను. అలాగని ఇప్పుడు ఖండించను లేను కూడా అని క్రిప్టిక్‌ ఆన్సర్‌ ఇచ్చింది. పెళ్లి గురించి ఎప్పుడు, ఎక్కడ మాట్లాడాలో అప్పుడే మాట్లాడతానని, కచ్చితంగా అందరికీ విషయం చెబుతాను అని తెలిపింది.

వ్యక్తిగత జీవితం గురించి బయటకు చెప్పడానికి ఇష్టపడను అని చెప్పిన రష్మిక.. పర్సనల్‌ లైఫ్‌ను సీరియస్‌గా తీసుకుంటానంది. ఇంట్లో ఉన్నప్పుడు వర్క్‌ గురించి మాట్లాడను. బయటకు వచ్చినప్పుడు పర్సనల్‌ లైఫ్‌ గురించి మాట్లాడను అని తేల్చేసింది. అయితే పర్సనల్‌ లైఫ్‌ గురించి లీకులు మాత్రం ఇస్తూ ఉంటుంది రష్మిక. మరి అదెందుకో ఆమెనే చెప్పాలి. ఇక పెళ్లి సంగతి చూస్తే ఫిబ్రవరిలో విజయ్‌ – రష్మిక డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోబోతున్నారని సమాచారం.

ఈ మేరకు ఇద్దరూ సెట్స్‌ మీద ఉన్న తమ సినిమాల టీమ్‌లకు ఇప్పటికే స్పష్టమైన సమాచారం ఇచ్చేశారట. ఆ లీకుల బట్టే ఇద్దరి వివాహం గురించి రూమర్లు వస్తున్నాయి. ఇదంతా ఓకే కానీ ఎందుకు చెప్పడం లేదనేగా డౌట్‌. నయనతారలా రష్మిక కూడా తన పెళ్లి కంటెంట్‌ను ఓటీటీకి అమ్మేస్తోంది అని ఓ పుకారు నడుస్తోంది.

అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus