Ravanasura: ‘రావణాసుర’ సెన్సార్ రివ్యూ ఇలా ఉందేంటి?

  • March 31, 2023 / 06:03 PM IST

మాస్ మహారాజ్ రవితేజ ‘ధమాకా’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్లోకి వచ్చాడు.ఆ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ మూవీలో కూడా నటించాడు. మరోవారం రోజుల్లో అతను ‘రావణాసుర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏప్రిల్ 7న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ‘అభిషేక్ పిక్చర్స్’, ‘ఆర్ టి టీమ్‌వర్క్స్‌’ బ్యానర్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. ఇది ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అన్న సంగతి తెలిసిందే.

అభిషేక్ నామా, రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లు పెద్దగా బజ్ ను క్రియేట్ చేయలేకపోయాయి. అయితే ఓ పాట మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ మధ్యనే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ‘ఎ’ రేటింగ్ ఇవ్వడం జరిగింది. సాధారణంగా పెద్ద సినిమాలకు యు లేదా యు/ఎ రేటింగ్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు వస్తారు.

ఈ మధ్య కాలంలో ఏదో ఒకరకంగా పెద్ద సినిమాలకు యు/ఎ రేటింగ్ ఇస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ‘దసరా’ చిత్రానికి యు/ఎ రేటింగ్ దక్కింది. మరి ‘రావణాసుర’ (Ravanasura) కి ఎ రేటింగ్ ఇచ్చారు అంటే సెన్సార్ సభ్యులు షాకయ్యారేమో అనిపిస్తుంది. పైగా టీజర్, ట్రైలర్లలో రవితేజ సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. మితిమీరిన వయొలెన్స్ తో కూడుకున్న సన్నివేశాలు ఈ చిత్రంలో ఎన్నో ఉన్నాయేమో అనిపిస్తుంది. మరోపక్క ఇది ఓ బెంగాలీ సినిమాకి రీమేక్ అన్న వాదన కూడా నడుస్తోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus