మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తమిళ రీమేక్ చిత్రం ‘తని ఒరువన్’ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరి18 న ప్రారంభించనున్నారని, ఈ చిత్రానికి తెలుగు ‘ధృవ’ అనే టైటిల్ ని ఖరారు చేసే అవకాశం ఉందని ఆ సినిమా పీఆర్ఓ రాజు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తమిళ ‘తని ఒరువన్’ చిత్రంలో హీరోగా నటించిన జయం రవి తెలుగు రీమేక్ లో నటిస్తున్న రాంచరణ్ పై కామెంట్స్ చేసాడు.
‘రాంచరణ్ తని ఒరువన్ చిత్రాన్ని తెలుగులో చేస్తున్న విషయం తెలియగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యానని, రాంచరణ్ వంటి అద్భుతమైన నటుడు ఈ సినిమా రీమేక్ చేయడం నిజంగా గొప్ప విషయమని, ఇక ఈ చిత్రం తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉన్నట్లు జయం రవి తెలిపాడు. ఇక తుఫాన్ చిత్రం తర్వాత రాంచరణ్ ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్నికి అల్లు అరవింద్ నిర్మాత.