క్రాక్ మూవీ తో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చిన రవితేజ ఇప్పుడు వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి మూవీ చేస్తున్నాడు. దర్శకుడికి కరోనా సోకడంతో షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉండగా ఈ చిత్రం తరువాత రవితేజ… త్రినాద్ రావ్ నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా అలాగే శరత్ మండవ అనే యువ దర్శకుడితో ఓ సినిమా చెయ్యడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అలాగే మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. ఈ ప్రాజెక్ట్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు 5వ ప్రాజెక్టుకి కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.అందుతున్న సమాచారం ప్రకారం..రక్ష,దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, జక్కన్న వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళతో ఓ సినిమా చెయ్యడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్రతో ఈ చిత్రం తెరకెక్కనుంది అని సమాచారం. గతంలో ఈ ప్రాజెక్ట్ ను రానాతో చెయ్యాలి అనుకున్నాడు. కానీ తరువాత అతను తప్పుకున్నాడు. అప్పుడు రానా ప్లేస్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పేరు వినిపించింది.కానీ ఇప్పుడు అతను బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.దాంతో ఈ ప్రాజెక్ట్ చెయ్యలేను అని చెప్పాడు.దాంతో రవితేజతో ఈ ప్రాజెక్ట్ చెయ్యాలని దర్శకుడు వంశీ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!