ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

ఇద్దరూ డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌ ఉన్న హీరోలు.. ఇద్దరూ డిఫరెంట్‌ వెటకారం ఉన్న హీరోలు.. ఇద్దరూ డిఫరెంట్‌ డైలాగ్‌ డెలివరీ చేయగల హీరోలు.. ఇద్దరికీ డిఫరెంట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఆ ఇద్దరిలో కామన్‌గా ఉండే పాయింట్‌.. కామెడీ. ఇద్దరూ కామెడీని అద్భుతంగా పండించగలరు. వాకింగ్‌, టాకింగ్‌, మేకింగ్‌, టేకింగ్‌.. ఇలా అన్నింటిలోనూ తోపు అని పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూపించే ప్రయత్నం టాలీవుడ్‌లో జరుగుతోంది. వారే రవితేజ, శ్రీవిష్ణు. ఇప్పుడు చెప్పండి పైన చెప్పిన విశేషణాలు, విశేషాలు కరక్టే కదా.

Raviteja – Sree Vishnu

మాస్ హీరోయిజంలో, కామెడీ, వెటకరాన్ని కలిపి వడ్డించి మెప్పించడంలో రవితేజ సూపర్‌. ఇంచుమించు ఇలానే చేసినా తనకంటూ సెపరేట్‌ స్టైల్‌ పట్టేసి నేటి తరం యువతకు ఐకాన్‌ అయిపోయాడు శ్రీవిష్ణు. ఆయన ఇలా అవ్వడంలో సాయం చేసిన దర్శకుడు హసిత్‌ గోలి. శ్రీవిష్ణుతో ఆయన వరుసగా మూడు సినిమాలు చేశారు. ఆయన చేసిన సినిమాలన్నీ శ్రీవిష్ణు హీరోగానే అని చెప్పొచ్చు. ‘మెంటల్‌ మదిలో’తో మొదలైన ఈ ఇద్దరి కాంబో జర్నీ ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్‌’తో హ్యాట్రిక్‌ కొట్టింది.

ఇప్పుడు హసిత్‌ గోలీ తన కొత్త సినిమాను రవితేజ హీరోగా చేస్తున్నారని టాక్‌. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తారు. ఇందులో శ్రీవిష్ణు కూడా కలసి నటిస్తున్నాడని టాక్‌. అయితే ఇది పూర్తి స్థాయి పాత్రనా? లేక చిన్న పాత్రనా అనేది తెలియదు. ఎలాంటి పాత్ర అయినా రవితేజ – శ్రీవిష్ణు కలిస్తే ఆ రచ్చే వేరు. ఈ విషయంలో త్వరలో సినిమా అనౌన్స్‌మెంట్‌ సమయంలో తేలిపోతుంది.

ఇక ఈ సినిమాను వచ్చే సంక్రాంతి రిలీజ్‌ లక్ష్యంగతా చేసుకొని తెరకెక్కిస్తారని టాక్‌. రవితేజ ప్రస్తుతం శివ నిర్వాణ ‘ఇరుముడి’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అదవ్వగానే హసిత్‌ గోలీ సినిమా పనుల్లోకి వస్తారట. మూడు, నాలుగు నెలల్లో సినిమా ముగించేయాలనేది దిల్‌ రాజు ప్లానట.

 ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus