టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ కూడా దాదాపు తుది దశకు చేరుకున్నాయి. సినిమా విడుదల తేదీపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా ఈ సినిమాతో మరో హిట్ అందుకొని సక్సెస్ రేట్ ను మరింత పెంచుకోవాలని రవితేజ ప్లాన్ చేసుకుంటున్నాడు.ఇక ఖిలాడి సినిమా ఈ ఏడాది డిసెంబర్లో వచ్చే అవకాశం ఉన్నట్లు ఒక టాక్ అయితే వస్తోంది.
మరో వైపు రవితేజ మల్టీస్టారర్ సినిమాల వైపు కూడా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా టాలీవుడ్ హీరోలు చాలామంది మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. రవితేజ కెరీర్ మొదలు పెట్టిన కూడా అలాంటి కథలు బాగానే చేశాడు. ఇక ఇప్పుడు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర చెప్పిన ఒక మాస్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు ఉపేంద్ర త్వరలోనే ఒక డిఫరెంట్ సినిమాను మొదలు పెట్టబోతున్నారు.
ఆ సినిమాలో రవితేజను కూడా ఒక ముఖ్యమైన పాత్ర కోసం తీసుకోవాలి అని అనుకుంటున్నారు. కన్నడ తెలుగులో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే అఫీషియల్ గా ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమాలో మాస్ రాజా ఏ విధంగా కనిపిస్తాడో చూడాలి.