Ravi Teja: ఆ సినిమా చూసి చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నా: హీరో రవితేజ

శ్రీవిష్ణు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. శ్రీవిష్ణు ఖాతాలో కొన్ని హిట్స్ కూడా పడ్డాయి. దీనితో శ్రీవిష్ణు కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీలు, ఫన్నీ రాబరీ కథలు, అలాగే కథా బలం ఉన్న ఎమోషనల్ చిత్రాలు కూడా చేస్తున్నాడు. శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ చిత్రం ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఈ చిత్రంలో హాస్యాన్ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. క్రిటిక్స్ కూడా మంచి రివ్యూలు ఇచ్చారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు, సీనియర్ నటుడు నరేష్, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ హైలైట్ గా నిలిచిందని అంటున్నారు. ఇప్పుడు సెలెబ్రిటీలు కూడా సామజవరగమన చిత్రానికి ఫిదా అవుతున్నారు. మాస్ మహారాజ్ రవితేజ ఈ చిత్రాన్ని చూసిన తర్వాత తన రివ్యూ తెలియజేస్తూ ప్రశంసలు కురిపించాడు. ‘చాలా రోజుల తర్వాత ఈ చిత్రాన్ని చూసి మనస్ఫూర్తిగా నవ్వుకున్నా.

సామజవరగమన చిత్రాన్ని చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేశా, వినోదాన్ని పొందా. శ్రీవిష్ణు తన పాత్రలో ఎంతో సహజంగా నటించాడు. వెన్నెల కిషోర్, నరేష్ ల కామెడీ టైమింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనిపించేలా ఉంది. చిత్ర నిర్మాతలకు కంగ్రాట్స్. దర్శకుడు రామ్ అబ్బరాజుకి , రైటింగ్ టీం కి నా శుభాకాంక్షలు. మీకు చాలా భవిష్యత్తు ఉంది అంటూ ప్రశంసలు కురిపించాడు.

రవితేజ (Ravi Teja) రివ్యూకి చిత్ర యూనిట్, శ్రీ విష్ణు స్పందించారు. మీరు అందించిన ప్రశంస తమకి చాలా గొప్పదని శ్రీ విష్ణు రిప్లై ఇచ్చారు. అలాగే గోపీచంద్, నారా రోహిత్ , ఆది సాయి కుమార్, అడివి శేష్ ఇలా యంగ్ హీరోలంతా ఈ చిత్రానికి ఫిదా అవుతూ తమ రెస్పాన్స్ తెలియజేస్తున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus