రవితేజ ఫ్యామిలీ ఫోటో..అందరి డౌట్ అదే?

సాధారణంగా షూటింగ్స్ తో బిజీగా ఉండే స్టార్స్ కి తమ ఫ్యామిలీ తో గడిపే టైమే ఉండదు. ఐతే కరోనా ప్రాణాంతక వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఇంటికే పరిమితం అవుతున్న సెలెబ్రిటీలు వారివారి వ్యాపకాలలో ముగినిపోతున్నారు. మాస్ మహారాజ్ రవి తేజ ఈ క్వారెంటైన్ సమయాన్ని తన పిల్లలతో సరదాగా గడపడానికి కేటాయించారు. రవితేజ తన కొడుకు కూతురితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అవి చూసినవారు రవితేజకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా అని ఆశర్యపోతున్నారు. 2000లో రవితేజ, కళ్యాణి ని పెళ్ళిచేకున్నారు.అప్పటికి రవితేజ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేదు. ఆయనకు బ్రేక్ ఇచ్చిన మొదటి చిత్రం ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు 2002లో విడుదలైంది. అదే ఏడాది ఆయన నుండి ఇడియట్, ఖడ్గం వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. రవితేజ-కళ్యాణిలకు మొదటి సంతానంగా 2003లో అమ్మాయి మోక్షద పుట్టింది. ఇక కొడుకు మహాధాన్ 2010లో జన్మించాడు.

మహాధాన్ 2017లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది. ఇటీవల డిస్కో రాజా చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఓ చిత్రం చేస్తున్నారు. క్రాక్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా రవితేజ మరోమారు పోలీస్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే చాల వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. క్రాక్ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus