హరీష్ శంకర్ – సల్మాన్ ఖాన్ ప్రాజెక్టు వెనుక అంత పెద్ద కథ ఉందా?

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్లో ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చేశారు. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు తెచ్చిపెట్టింది. తర్వాత ఇదే బ్యానర్లో ఇంకో సినిమా చేయడానికి బాలయ్య సైన్ చేశారు. ఇప్పుడు బాలయ్యకి ఉన్న క్రేజ్, ఆయన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని.. మైత్రి వాళ్ళు కథలు వింటున్నారు. నచ్చినవి బాలయ్య వద్దకి పంపిస్తున్నారు. అయితే ఇంకా బాలయ్య ఏ కథని ఓకే చేయలేదు.

Harish Shankar, Salman Khan

మరోపక్క మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఆవేశం’ చిత్రం రీమేక్ రైట్స్ ను ‘మైత్రి’ వారు కొనుగోలు చేశారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ఇప్పట్లో కంప్లీట్ అయ్యే అవకాశాలు లేనందున హరీష్ శంకర్ ను (Harish Shankar) స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారు. అలా హరీష్ ఐడియాస్ మైత్రి వాళ్ళకి నచ్చాయి. కానీ బాలయ్య ఆ కథతో సంతృప్తి చెందలేదు అని వినికిడి. అలాగే బాలయ్య కాల్షీట్స్ కూడా ఇప్పుడు ఖాళీగా లేవు.

‘అఖండ 2’ తో పాటు గోపీచంద్ మలినేని చెప్పిన కథకి కూడా ఆయన ఓకే చెప్పారు. వాటితో ఆయన బిజీ బిజీ. అయితే బాలయ్యతో చేయాలనుకున్న ‘ఆవేశం’ రీమేక్ ను.. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో (Salman Khan) చేయడానికి ‘మైత్రి’ వారు రెడీ అయ్యారట. అవును హరీష్ శంకర్ దర్శకత్వంలోనే ఇది పట్టాలెక్కబోతున్నట్టు టాక్. ఇటీవల సల్మాన్ ఖాన్ ని హరీష్ శంకర్, ‘మైత్రి’ వారు కలిసొచ్చినట్టు టాక్.

 ‘పుష్ప 2’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కానీ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus