నాగవంశీ (Suryadevara Naga Vamsi)… సింపతీ కార్డు.. నిన్న,మొన్నటి వరకు ఇవి హాట్ టాపిక్స్. గత 3 పండుగ సీజన్లను గమనిస్తే.. నాగవంశీ నిర్మించిన సినిమాలు కంటే.. పోటీలో ఉన్న సినిమాలు.. ముఖ్యంగా కొంచెం తక్కువ రేంజ్ ఉన్న సినిమాలు ‘సింపతీ కార్డు’ వాడుకుని ఎక్కువ బజ్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా, ఎక్కువ కలెక్షన్స్ కూడా రాబట్టుకున్నాయి అని చెప్పొచ్చు. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) పక్కన రిలీజ్ అయిన ‘హనుమాన్’ (Hanuman) చిన్న సినిమా అనే ట్యాగ్ ను తగిలించుకుని.. ఆడియన్స్ అటెన్షన్స్ పొందింది.
తర్వాత కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి. తర్వాత ‘లక్కీ భాస్కర్’ కి (Lucky Baskhar) పోటీగా రిలీజ్ అయిన ‘క’ (KA) సినిమా కూడా ‘చిన్న సినిమా’ అనే ట్యాగ్ తో ‘లక్కీ భాస్కర్’ కంటే ఎక్కువ లాభాలు పొందింది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj)కంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా రెండింతలు లాభాలు పొందింది. ‘డాకు’ కంటే కొంచెం తక్కువ రేంజ్ ఉన్న సినిమా అనే తప్ప.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీం ఎటువంటి కాంట్రోవర్సీ క్రియేట్ చేయలేదు. అలా అని ‘డాకు..’ కంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కంటెంట్ ఏమీ బెటర్ గా ఉండదు.
సరే.. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే, ఈసారి ‘సింపతీ కార్డు నేను కూడా వాడతాను’ అని నాగవంశీ చెప్పడం జరిగింది. ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square)కోసం సింపతీ కార్డు వాడుకుంటున్నట్టు కూడా నాగవంశీ తెలిపాడు. ‘మైత్రి రవన్న వాళ్ళ సినిమానే(రాబిన్ హుడ్ Robinhood) నే చూడమంటున్నాడు.., మా సినిమాని తొక్కేద్దామని చూస్తున్నాడు. కాబట్టి మీరు ఇది గమనించి మా ‘మ్యాడ్ స్క్వేర్’ అనే చిన్న సినిమాని హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
అలాగే ఓ ప్రెస్ మీట్లో ‘మాది చిన్న సినిమా కాబట్టి ఎక్కువ థియేటర్లు ఇవ్వలేదు’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. కట్ చేస్తే ఉగాది పోటీలో వచ్చిన సినిమాల్లో ‘మ్యాడ్ స్క్వేర్’ నే ఆడియన్స్ విన్నర్ గా నిలబెట్టారు. దీనిపై నాగవంశీ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ‘సింపతీ కార్డు అనే కాదు.. యూత్ ఫుల్ కామెడీ కంటెంట్ కి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది అనేది నా నమ్మకం. అది నిజమైంది’ అంటూ నాగవంశీ చెప్పుకొచ్చారు.
Phani Kumar: సింపతి కార్డ్ కలిసి వచ్చిందా.. కంటెంట్ నిలబెట్టిందా?#NagaVamsi #MadSquare @vamsi84 response pic.twitter.com/wumpo1DRHl
— Phani Kumar (@phanikumar2809) April 1, 2025