Sreeleela: స్టార్ హీరోయిన్ శ్రీలీలని ఇబ్బంది పెడుతున్న మరో బ్యాడ్ సెంటిమెంట్..!

‘పెళ్లిసందD’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఆ సినిమాకి హిట్ టాక్ రాకపోయినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించి కమర్షియల్ హిట్ గా నిలిచింది. అందుకు కారణం శ్రీలీల గ్లామర్ అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత వచ్చిన ‘ధమాకా’ (Dhamaka) కూడా అంతే. అయితే ‘స్కంద’ (Skanda) నుండి శ్రీలీలని ప్లాపులు వెంటాడుతున్నాయి. మధ్యలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) తీసేస్తే.. ‘ఆదికేశవ'(Aadikeshava) ‘ఎక్స్ట్రా’ (Extra Ordinary Man)వంటి సినిమాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. ఇప్పటికీ ఆమె కోలుకోలేదు.

Sreeleela

దీంతో ఆమె డిమాండ్ కూడా టాలీవుడ్లో బాగా తగ్గిపోయింది. ప్లాపుల సంగతి ఎలా ఉన్నా.. శ్రీలీలని మరో బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతున్నట్టు స్పష్టమవుతుంది. దాని వల్ల శ్రీలీలకి అస్సలు కలిసి రావడం లేదట. విషయం ఏంటంటే.. వేరే హీరోయిన్ రిజెక్ట్ చేసిన లేదా చేయలేకపోయిన సినిమాలో కనుక శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైతే..ఆ సినిమా కచ్చితంగా నిరాశపరుస్తుందట. ఆమెకు చేదు ఫలితాన్నే మిగులుస్తుందట.

అది ఎలా అంటారా? ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా నుండి పూజా హెగ్డే (Pooja Hegde) తప్పుకోవడం జరిగింది. తర్వాత శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయ్యింది. 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు. ఇక తాజాగా వచ్చిన ‘రాబిన్ హుడ్’  (Robinhood) విషయంలో కూడా ఇదే జరిగింది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికని (Rashmika Mandanna) తీసుకున్నారు. కానీ ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల..

ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. దీంతో శ్రీలీలని తీసుకున్నారు. కట్ చేస్తే ఈ సినిమా కూడా ప్లాప్. అంతేకాదు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)  సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించాలి. కానీ అనుకోకుండా ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. తర్వాత శ్రీలీలని తీసుకున్నారు. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో? ఈ ఏడాది అయితే ‘ఉస్తాద్’ రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు.

హరీష్ శంకర్ – సల్మాన్ ఖాన్ ప్రాజెక్టు వెనుక అంత పెద్ద కథ ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus