Ravi Teja: మరోసారి తమిళ దర్శకుడితో రవితేజ.. గతంలో ఓ దర్శకుడు దెబ్బేసినా..!

రవితేజ (Ravi Teja) యాక్షన్‌కి, కామెడీకి సెట్‌ ఆఫ్‌ ఆడియన్స్‌ ఉన్నారు. ఆయన సినిమాలు చూసి నవ్వుకోని వారుండరు. అయితే ఇటీవల కాలంలో ఆయన సినిమాల్లో మజా తగ్గుతోంది. వచ్చిన ఒకట్రెండు విజయాలు కూడా కామెడీ సినిమాలతోనే అందుకున్నారు. అంటే ఎక్కువ కామెడీ పాళ్లతో చేసిన సినిమాలే అని మా ఉద్దేశం. ఇప్పుడు తిరిగి హిట్‌ ట్రాక్‌ ఎక్కాలని చూస్తున్న రవితేజ.. మరోసారి కామెడీ బాటపట్టారు అని తెలుస్తోంది.

Ravi Teja

విజయం, అపజయం.. రవితేజ (Ravi Teja) సినిమాల జోరుకు ఈ రెండు అంశాలు పెద్దగా అడ్డు రావు. మంచి విజయం పడితే ఎక్కువ ఆలోచించి సినిమాలు తగ్గించుకోరు. విజయం లేకపోతే ఢీలా పడిపోయి వెనక్కిపోరు. అలా రీసెంట్‌గా వరుస పరాజయాలు అందుకుంటున్నా కొత్త సినిమాలు ఓకే చేస్తున్నారు. అందుకే నాలుగు ఫ్లాప్‌లు వచ్చినా ఇప్పుడు చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మరో సినిమా దాదాపు ఓకే అయింది.

ప్రముఖ కోలీవుడ్‌ దర్శకుడు సుంద‌ర్.సి (Sundar.C) డైరక్షన్‌లో ఓ సినిమా చేయడానికి రవితేజ ఆసక్తికగా ఉన్నారు అని అంటున్నారు. సొంత నిర్మాణ సంస్థ ఆర్టీ టీమ్‌ వర్క్స్‌, సుందర్‌.సి నిర్మాణ సంస్థ కలసి ఈ సినిమా నిర్మిస్తాయట. సుందర్‌.సి కామెడీ జోనర్‌ మీద మంచి పట్టున్న దర్శకుడు. రవితేజకు కామెడీ కొట్టిన పిండి. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిస్తే ఏమవుతుంది, వినోదం ఎంత వడ్డిస్తారు అనేది చూడాలి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అదే రవితేజ 76వ సినిమా అవుతుంది.

ఇక ప్రస్తుతం రవితేజ ‘కోహినూర్‌’ అనే ఓ సినిమా చేస్తున్నారు. దీంతోపాటు మరో సినిమా ఫైనల్‌ దశలో ఉంది. త్వరలో ప్రకటన ఉండొచ్చు. ఈలోపు సుందర్‌.సి సినిమా ప్రస్తావన వచ్చింది. చూడాలి మరి ఏ సినిమా ముందు స్టార్ట్‌ చేస్తాడో? అయితే ఇక్కడ డౌట్‌ ఏంటంటే గతంలో ఇలానే ఓ తమిళ దర్శకుడితో సినిమా చేసిన రవితేజ దారుణమైన పరాజయం పాలయ్యాడు. ఆ లెక్కన ఈ సినిమాతో ఆ మచ్చ కూడా చెరిపేసుకోవచ్చు.

ఆ కామెంట్లు హర్ట్ చేయడం వల్లే తారక్ అలా రియాక్ట్ అయ్యారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus