Jr NTR: ఆ కామెంట్లు హర్ట్ చేయడం వల్లే తారక్ అలా రియాక్ట్ అయ్యారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీ సంచలన విజయం సాధించగా ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ నిర్మాత అయినా నిర్మాణ బాధ్యతలను చూసుకున్న వ్యక్తి కొసరాజు హరికృష్ణ అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ బాధ్యతలను గత కొన్నేళ్లుగా ఆయన చూసుకుంటున్నారు. కొసరాజు హరికృష్ణ కళ్యాణ్ రామ్ బావమరిది కాగా ఇండస్ట్రీ జనాలకు ఎన్టీఆర్ ఆర్ట్స్ హరిగా ఆయన సుపరిచితం.

Jr NTR

అయితే ఇటీవల దేవర సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ జరగగా ఆ సెలబ్రేషన్స్ లో తారక్ మాట్లాడుతూ ఎవరికి నచ్చినా నచ్చకున్నా తమకు అన్నీ హరి అని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ హరి లేకుండా ఉండదని చెప్పుకొచ్చారు. అయితే కొంతమంది హరి గురించి అపార్థం చేసుకోవడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ ఆ విధంగా కామెంట్లు చేశారని సుమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ చేసిన కామెంట్ల ద్వారా అర్థమైంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ కోసం, ఆ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమాల కోసం హరి ఎంతో కష్టపడుతున్నా కొంతమంది హరిని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ ఈ విధంగా క్లారిటీ ఇచ్చేశారు. కళ్యాణ్ రామ్ హీరోగా కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో నిర్మాణ బాధ్యతలను హరికృష్ణకు అప్పగించడం జరిగింది. పబ్లిక్ ఈవెంట్లకు హరి దూరంగా ఉన్నా సినిమా సక్సెస్ సాధించడానికి ఆయన తన వంతు కష్టపడతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

మరోవైపు దేవర2 స్క్రిప్ట్ వర్క్ త్వరలోనే మొదలుకానుండగా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాల్సి ఉంది. దేవర సీక్వెల్ లో ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరకనున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ దేవర సీక్వెల్ తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. రేపటి నుంచి సాధారణ టికెట్ రేట్లతో దేవర మూవీ ప్రదర్శితం కానుంది.

కొడుకుల సినీ ఎంట్రీ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus