#RT70: పవర్ఫుల్ టైటిల్ తో రాబోతున్న రవితేజ!

  • November 2, 2021 / 12:02 PM IST

మాస్ మహారాజ రవితేజ మొత్తానికి క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. గతంలో వరుస అపజయాలతో కాస్త సతమతమైన రవితేజ ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని క్రాక్ సినిమాతో ఒక్కసారిగా తన బాక్సాఫీస్ మార్కెట్ ను అమాంతంగా పెంచేసుకున్నాడు. ఇక తదుపరి సినిమాలు కూడా అదే తరహాలో సక్సెస్ అవ్వాలని చాలా జాగ్రత్తగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం రవితేజ చాలా బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే

అలాగే తన 70వ సినిమాపై కూడా ఒక క్లారిటీ ఇచ్చేశాడు. టాలెంటెడ్ యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ సినిమా చేయబోతున్నట్లు ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపించింది. ఇక ఫైనల్ గా వీరి కాంబినేషన్ ఒక డిఫరెంట్ థ్రిల్లర్ సినిమాతో కలవబోతున్న ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ లో ఈ నెల 5న అనౌన్స్ చేయబోతున్నారు. అయితే సినిమాకు రెండు మూడు టైటిల్స్ ను చర్చలోకి తీసుకురాగా

మాస్ రాజా రవితేజ ‘రావణాసుర’ అనే పవర్ఫుల్ టైటిల్ అయితే బాగుంటుంది అని సలహా ఇచ్చాడట. సుధీర్ వర్మ కూడా కథకు ఆ టైటిల్ పర్ఫెక్ట్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ గా పోస్టర్ ద్వారా క్లారిటీ ఇవ్వనున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus