Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

తెలుగు సినిమా రంగంలో భిన్నమైన కథలు, డార్క్ టోన్ ప్రయోగాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవి బాబు మరోసారి ప్రేక్షకులను తన మేజిక్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. రవి బాబు – సురేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రేజర్’ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు ఫ్లయింగ్ ఫ్రాగ్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది.

Razor

ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్, టీజర్‌లను చూస్తే ‘రేజర్’ సాధారణ కమర్షియల్ సినిమా కాదని స్పష్టమవుతోంది. డైలాగులు లేకుండానే కేవలం విజువల్స్, సౌండ్ డిజైన్‌తో భయాన్ని, టెన్షన్‌ను పెంచే ప్రయత్నం చేశారు. రా అండ్ బ్రూటల్ యాక్షన్‌తో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమాలో రవి బాబు దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, పూర్తిగా కొత్త షేడ్‌లో కనిపించనున్నారు.

గతంలో రవి బాబు తెరకెక్కించిన అనసూయ, అవును వంటి సినిమాలు ఆయనకు దర్శకుడిగా ప్రత్యేక స్థానం తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ జానర్‌లో తనదైన ముద్ర వేసిన రవి బాబు, ఈసారి ఆ అనుభవాన్ని మరింత డార్క్‌గా, ఇంటెన్స్‌గా చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఒక సరికొత్త బలమైన కాన్సెప్ట్ చుట్టూ ఈ కథ నడుస్తుందని సమాచారం. వేసవి సీజన్‌ను టార్గెట్ చేస్తూ మే 2026లో ‘రేజర్’ను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రవి బాబు గత చిత్రాలకు భిన్నంగా ఈసారి ఎలాంటి షాక్ ఇస్తారో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus