Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, ముద్దుగుమ్మ రష్మిక మందన జోడి మూడు మూళ్ళ బంధం ద్వారా ఒకటవ్వబోతున్నట్టు రకరకాల వార్తలు ఎప్పటినుంచో తెగ చక్కర్లు కొడుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ వార్తలకి సంబంధించి అతి త్వరలోనే అధికారికంగా అనౌన్స్మెంట్ రాబోతుందట. మొన్న ఆ మధ్య వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగినట్టు సమాచారం. కానీ ఆ విషయమై ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు రీసెంట్ గా వీరి వివాహం & రిసెప్షన్ తేదీలపై కొన్ని వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.

Vijay-Rashmika

కాగా, విజయ్-రష్మిక జంట వివాహం ఈ నెల (ఫిబ్రవరి) 26న రాజస్థాన్ లోని ఉదయపూర్ వేదికగా అత్యంత సన్నిహితులు మరియు బంధుమిత్రుల సమక్షంలో జరగనున్నట్టు సినీ వర్గాల నుంచి వినికిడి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ జంట పెళ్లి అనంతరం జరిగే రిసెప్షన్ ను హైదరాబాద్ లో మార్చి 4న చాలా ఘనంగా నిర్వహించబోతున్నారట. ఈ కార్యక్రమానికి సినీ రంగ పెద్దలు, ప్రముఖ నటులు మరియు రాజకీయ ప్రముఖులు హాజరు అవ్వనున్నారని సమాచారం. ఏకంగా డేట్స్ తో సహా వార్తలు వైరల్ అవుతున్న కూడా అటు విజయ్ నుంచి కానీ , ఇటు రష్మిక నుంచి కానీ ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఫ్యాన్స్ మాత్రం అధికారిక ప్రకటన కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన’ మూవీ మరియు రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో ‘రణబాలి’ చిత్రాల షూటింగ్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు.

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus