టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ కలిసి ఉన్న ఓ ఫోటో గత 2 రోజుల నుండి తెగ వైరల్ అవుతుంది.అలాగే హాట్ టాపిక్ అయ్యిందని కూడా చెప్పొచ్చు. అసలు ఈ స్టార్స్ ఎప్పుడు కలిశారు? దేనికి కలిశారు? వీరి కాంబోలో ఏదైనా భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారా బాలీవుడ్ మేకర్స్? అంటూ విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. తప్పేమీ లేదు అభిమానుల ఆశలకి హద్దేముంటుంది.
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తుండటంతో.. వరల్డ్ వైడ్ గా మహేష్ బాబు పేరు మార్మోగుతుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక మహేష్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈలోపు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ మహేష్ బాబు డేట్స్ కోసం వెంటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే మహేష్ బాబు, అలీ అబ్బాస్ జాఫర్ ఫోటో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.
‘సుల్తాన్’ ‘టైగర్ జిందా హై’ బ్లాక్ బస్టర్ సినిమాలతో అలీ అబ్బాస్ జాఫర్ కూడా పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటి దర్శకుడితో మహేష్ బాబు సినిమా చేస్తే.. ట్రేడ్ వర్గాలు మొత్తం ఆ ప్రాజెక్టు వైపు చూస్తాయి. కానీ వీరు కలుసుకున్నది సినిమా కోసం కాదు. ఓ బ్రాండ్ ప్రమోషన్ కోసం. అవును ‘మౌంటెన్ డ్యూ’ (Mountain Dew) అనే సాఫ్ట్ డ్రింక్ ని మహేష్ బాబు ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
దాని కోసం ఈ స్టార్స్ ఇద్దరూ జతకట్టారు. ‘షూటింగ్ టైమ్లో మహేష్ బాబు చూపించిన ఎనర్జీ, డెడికేషన్‌కు ఫిధా అయిపోయినట్టు’ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ కూడా బాలీవుడ్ మీడియాతో పంచుకున్నారు.