మాల్దీవులకు హాలిడే.. మన తారల గుట్టురట్టు!

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా విజృంభణ కొనసాగుతోంది. కానీ మన తారలు మాత్రం ఎంతమాత్రం భయపడకుండా కరోనా ఫ్రీ ప్రాంతమన్నట్లు మాల్దీవులకు హాలిడేకి వెళ్తుండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇండియన్ సినిమా, టెలివిజన్ కి సంబంధించిన చాలా మంది సెలబ్రిటీలు మాల్దీవులకు ట్రిప్ కి వెళ్లారు. వీరిలో సమంత, చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ లు కూడా ఉన్నారు. మరో ప్రాంతానికి వెళ్లకుండా అందరూ మాల్దీవులకు ఎందుకు వెళ్తున్నారని అనుమానాలు కలిగాయి.

అయితే ఈ ట్రిప్ వెనుక ఉన్న గుట్టుని బయటపెట్టేశాడు ఓ బాలీవుడ్ నటుడు. మాల్దీవులకు హాలిడేకి రావాలంటూ తనకూ ఆహ్వానం వచ్చిందని.. ట్రావెల్ ఖర్చులతో పాటు మాల్దీవుల్లో ఉన్నన్ని రోజులకు అవసరమయ్యే వసతులన్నీ తామే భరిస్తామని పలు రిసార్ట్ ల నుండి పిలుపు వచ్చిందట. అయితే ట్రిప్ లో ఉన్న సమయంలో తమ రిసార్ట్ ని హైలైట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్స్ ఇవ్వాలని అడిగారట. ఈ విషయాలను చెప్పిన బాలీవుడ్ నటుడు అక్కడకి వెళ్లనప్పటికీ మిగిలిన తారలు ఎందుకు వెళ్లారనే విషయాన్ని బయటపెట్టేశాడు.

కరోనా కారణంగా టూరిజం మీద ఎంత పెద్ద దెబ్బ పడిందో తెలిసిందే. అందుకే మాల్దీవుల్లోని రిసార్ట్ ఓనర్లు ఈ విధంగా ఇండియన్ సెలబ్రిటీలను ఆకర్షించి దాని ద్వారా మిగతా జనాలను రాబట్టాలని చూస్తున్నారు. వారి ఐడియా కూడా వర్కవుట్ అయ్యేలానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఎంతమంది వెళ్తున్నారని విషయాన్ని పక్కన పెడితే.. మాల్దీవులకు వెళ్లి తీరాలనే జనం మాత్రం సోషల్ మీడియాలో బాగానే పెరిగారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus