రాజమౌళి ఇంటికి చిరంజీవి వెళ్లడం వెనుక భిన్న కథనాలు!

  • May 24, 2017 / 09:49 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు మంచి సినిమా తీసిన వారిని అభినందించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎల్లప్పుడూ ముందు ఉంటారు. తన స్థాయిని కూడా పక్కన పెట్టి వారి ఇంటికి వెళ్లి మరీ అప్రిషియేట్ చేస్తారు. అలాగే తెలుగు వాళ్ళు గర్వించదగ్గ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళిని ప్రశంసించడానికి నిన్న చిరు అతని ఇంటికి వెళ్లారు. అలా చిరంజీవి, రాజమౌళి కలవడం ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అయింది. చిరు జక్కన్నని మీట్ అవ్వడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్ ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి సినిమా చేయబోతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీ నిర్మాణ విషయంలో జాగ్రత్తలు, సలహాల కోసమే చిరు రాజమౌళి ఇంటికి వెళ్లారనే వార్త జోరుగా సాగుతోంది. అంతే కాదు రాజమౌళి తన కోసం ఒక సినిమా చేయాలనీ కోరినట్లు సమాచారం. ఇది వరకు రామ్ చరణ్ ని హీరోగా పెట్టి జక్కన్న మగధీర చేశారు. అందులో చిరు కూడా నటించారు. ఇప్పుడు ఫుల్ లెన్త్ మూవీ చేయాలనీ కోరినట్లు తెలిసింది. వీటిలో ఎంత వరకు నిజం ఉందో రాజమౌళి, చిరంజీవికే తెలియాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus