మంచు లక్ష్మీ భారీ బర్త్ డే పార్టీ బ్యాక్ స్టోరీ!

  • October 9, 2017 / 12:05 PM IST

ప్రతి మనిషి జీవితంలో బర్త్ డే అనేది మర్చిపోలేని రోజు. కొందరు స్నేహితులతో సరదాగా గడిపితే ఇంకొందరు కుటుంబ సభ్యులతో జన్మదిన వేడుకలను నిర్వహించుకొంటారు. ఇవన్నీ సగటు జనాల సంబరాలు కానీ మన సినిమా సెలబ్రిటీల జన్మదిన వేడుకలు వారు జరుపుకోకపోయినా వారి అభిమానులు మాత్రం ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే.. తాను నిర్వహించుకొనే పుట్టినరోజు వేడుకల వెనుక మాత్రం చాలా పెద్ద కారణం ఉందని చెబుతోంది మల్టీ టాలెంటెడ్ లేడీ మంచు లక్ష్మీ.

ఇటీవల తన జన్మదిన వేడుకలను తన స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో జరుపుకొన్న మంచు లక్ష్మీ ఫిలిమ్ నగర్ లోని తన ఇంట్లో పెద్ద పార్టీ ఏర్పాటు చేయడమే కాక అభిమానులు ప్రేమతో తెచ్చి కేకులు కట్ చేసి కాస్త ఘనంగానే తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకొంది. ఘనమైన అనే విషయం పక్కన పెట్టేస్తే.. అసలు బర్త్ డే పార్టీలు ఎందుకు నిర్వహించుకొంటారు అనే విషయం మీద మంచు లక్ష్మీ చాలా పెద్ద ఎక్స్ ప్లనేషన్ ఇచ్చింది. “నాపై ఉన్న పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ, నాగురించి తప్పుగా మాట్లాడుకొనేవారికి “నేనింకా బ్రతికున్నాను” అనే విషయాన్ని కాస్త గట్టిగా వినబడేలా చేయడం కోసమే ఇలా బర్త్ డే పార్టీలు నిర్వహించుకొంటుంటాను” అంటూ మంచు లక్ష్మీ చెప్పిన సమాధానంలో కాసింత బాధతోపాటు తనపై జోకులు వేస్తూ నవ్వుకొనేవారిపై కసి కూడా కనిపించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus