కేరళ బ్యూటీ నయనతార రహస్యంగా పెళ్లి చేసుకుందా?.. సొంత ఇల్లు కొనుక్కొని కాపురం చేస్తుందా?.. అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి కోలీవుడ్ వర్గాలు. శింబు, ప్రభుదేవాతో ప్రేమ పెళ్లి దాకా వెళ్లి విఫలం కావడంతో ఈసారి పెళ్లి చేసుకున్న తర్వాత తన ప్రేమను నయన బయటపెట్టాలనుకున్నదని తమిళ పత్రికలూ కథనాలను ప్రచురిస్తున్నాయి. నయన తార ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఎవరంటే యంగ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్. అతని దర్శకతంలో మూవీ చేసినప్పుడు వీరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. మరి రహస్యంగా పెళ్లి ఎందుకు చేసుకుంది?, కాపురం చేస్తుందని అడిగితే.. అవకాశాలు తగ్గిపోకూడదని ఈ జంట ఈ సీక్రెట్ మైంటైన్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నయనతార నాలుగు తమిళ సినిమాలు చేస్తోంది.
తెలుగులోనూ బాలకృష్ణ సరసన జై సింహాలో ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంలోను నటిస్తోంది. పెళ్లి అయిపోయిందంటే అభిమానుల్లో క్రేజ్ తగ్గిపోతుందని, అది సినినిమా విజయంపై ప్రభావం చూపిస్తుందని భయపడి తన జీవితంలో మధురమైన సందర్భాన్ని దాచిపెట్టున్నట్లు తమిళ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అయినా పెళ్లి సంగతి రివీల్ చేస్తారో లేదో చూడాలి.