సమంత కర్రసాము సాధన చేసింది ఆ సినిమా కోసం కాదంట!
- April 29, 2017 / 12:57 PM ISTByFilmy Focus
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత అద్భుతంగా కర్ర తిప్పుతున్న వీడియో వారం రోజుల క్రితం సోషల్ మీడియాలో బాగా లైక్లు అందుకుంది. ఈ సాధన చూసిన అందరూ ఇది రామ్‌చరణ్ సినిమా కోసం అని అనుకున్నారు. ఎందుకంటే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా 1980 నాటి కాలంలో సాగే కథ. ఇందులో చెర్రీ పల్లెటూరి కుర్రోడిగా నటించనున్నారు. సమంత పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. సో అప్పుడు గ్రామీణ యువతులకు కర్ర సాములో కొంత ప్రావీణ్యం ఉండేది కదా.. అందుకోసమే సమంత కర్ర తిప్పడం నేర్చుకుంటోందని అనుకున్నారు. అయితే ఆ సినిమా కోసం కాదని తాజాగా తెలిసింది.
తమిళంలో శివకార్తికేయన్ హీరోగా ఓ మూవీ తెరకెక్కుతోంది. సమంతా ఒక సినిమా చేస్తోంది. పొన్ను రామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలోనే సాగుతుందంట. కథ ప్రకారం ఈ సినిమాలో సమంతా పాత్ర కర్రసాము చేయవలసి ఉంది. అందువలన కొన్ని నెలలుగా కర్ర సాములో శిక్షణ తీసుకుంటోంది. ఆగస్టు నుంచి ఆ చిత్ర షూటింగ్ లో పాల్గొననుంది. ఈ సినిమా గురించి సమంత మాట్లాడుతూ ” సవాళ్లతో కూడుకున్న పాత్రలు చేయడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. నా కెరీర్‌లో ఇదొక ప్రత్యేక చిత్రమవుతుంది” అని వెల్లడించింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















