పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఎస్.జె.సూర్య తో చిత్రం చేయాలనుకున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. కానీ ఈ దర్శకుడు పవన్ సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ విషయం పై ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. “క్షత్రియ పుత్రుడు సినిమాలో కమల్ హాసన్ పంచె కట్టుతో కనిపించారు, అప్పుడు అది ట్రెండ్ సెట్టర్ గా మారింది.
ఆ లుక్ లో పవన్ ని చూపించాలని అనుకున్నాను. రాయల సీమ బ్యాక్ డ్రాప్ లో ఫ్యాక్షన్ లవ్ స్టోరీని తెరకెక్కించాలనుకున్నాను. అందుకోసం రచయిత ఆకుల శివ సహాయం తీసుకున్నాను. వంద కోట్ల బడ్జెక్టు తో నిర్మించాలని ప్లాన్ చేసాం, కానీ పవన్ తో సినిమా చేయడం అంత ఆషామాషీ కాదు” అని చెప్పారు. “ఖుషి చిత్రం తీసేటప్పుడు పవన్ రేంజ్ వేరు, ఇప్పుడు ఆయన పెద్ద సూపర్ స్టార్.” అని వెల్లడించారు.
సెట్స్ మీదకు వచ్చిన చిత్రానికి అనూహ్య పరిస్థితుల్లో ఎస్.జె.సూర్య స్థానంలో డాలీ చేరారు. దీని వెనుక ఎస్.జె.సూర్య పవన్ ని హ్యాండిల్ చేయలేక పోవడమే కారణమయి ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.