విక్రమ్ సినిమా వద్దనుకొన్న త్రిష!

Advertisement

ఈమధ్య పాపం విక్రమ్ సినిమాలే కాదు ఆయన టైమ్ కూడా బాగోట్లేదు. వరుసబెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఒక్క సినిమా కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. పాపం ప్రతి సినిమా కోసం విపరీతంగా కష్టపడడం, ఆ సినిమా ఫెయిల్ అవ్వడం, ఫ్లాపయిన సినిమా గురించి మర్చిపోయి మరో కొత్త సినిమా కోసం కష్టపడడం.. గత కొన్నేళ్లుగా విక్రమ్ దినచర్య ఇదే అయిపోయింది. “ఇంకొక్కడు” ఫ్లాప్ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొన్న విక్రమ్ నటిస్తున్న చిత్రం “సామి 2”. “సింగం” సిరీస్ సృష్టికర్త హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల ప్రారంభమైంది. “సామి” తొలి భాగంలో కథానాయికగా నటించిన త్రిషను మలిభాగంలోనూ కథానాయికగా ఎంపిక చేశారు. కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు.

కానీ.. ఉన్నట్లుంది త్రిష ఈ సినిమా నుంచి తప్పించుకొని సింపుల్ గా డేట్స్ లేకపోవడమే కాదు డైరెక్టర్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని చెబుతోంది. ఏ కెమెరామెన్ లేదా ఆర్ట్ డైరెక్టర్ కి దర్శకుడితో విబేధాలు తలెత్తాయంటే రీజన్ ఉంటుంది కానీ.. ఒక హీరోయిన్ కి అది కూడా ఆల్రెడీ సదరు దర్శకుడితో రెండుమూడు సినిమాలకు వర్క్ చేసిన త్రిషకి మరి హరితో ఏం క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయో అర్ధం కావడం లేదు. విక్రమ్ కెరీర్ గ్రాఫ్ ను దృష్టిలో పెట్టుకొని ఆమె ఇలా చేసిందా లేక వేరే ఏదైనా కారణమో తెలియదు కానీ.. త్రిష ఇప్పుడు “సామి 2” నుంచి బయటకి వచ్చేయడంతో ట్విట్టర్ లో టార్గెట్ అయిపోయింది. ఆమెపై ట్వీట్లతో కామెడీ చేసేస్తున్నారు జనాలు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus