టాలీవుడ్ లో దాదాపుగా 30ఏళ్ల పాటు టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్నాడు చిరు. అయితే స్వయంకృషితో పైకి వచ్చిన హీరో అంటూ ఫ్యాన్స్ చిరుని నెత్తినపెట్టుకున్నా చిరు కరియర్ గురించి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే దాదాపు 10ఏళ్ల సుధీర్గ విరామం తరువాత చిరు మళ్ళీ టాలీవుడ్ లో కి రీ ఎంట్రీ ఇచ్చి, తన సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. అయితే అదే క్రమంలో రిస్క్ చేస్తే రిసల్ట్ తేడా వస్తుంది అని అనుకున్నాడో ఏమో తెలీదు కానీ, ఫక్తు తమిళ కమర్షిల్ కధని అరువు తెచ్చుకుని మరీ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాననిపించుకున్నాడు. అయితే చిరుపై ఫ్యాన్స్ కి ఏమాత్రం అభిమానం తగ్గలేదు అని ఈ 150వ సినిమా చెప్తుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా దాసరి మరణం సంభవించడం, చిరు దానికి హాజరు కాకపోవడం చూస్తే అప్పట్లో చిరు-దాసరి మధ్య ఉన్న భేదాలే కారణామా అన్న అనుమానం కలుగుతుంది.
అయితే మీడియా ముందు, కెమేరాల సాక్ష్యంగా చిరు-దాసరి కాస్త విభేదించినా, తెరవెనుక మాత్రం ఒకరికొకరు అన్నట్లుగానే ఉండేవారు. ఇదిలా ఉంటే చిరు దాసరి చివరి యాత్రకి ఎందుకు రాలేదు అంటే చైనాలో ఉండడం వల్ల రాలేదని తెలుస్తుంది. అసలు చిరు చైనా ఎందుకు వెళ్లాడు అంటే…ఒకసారి ఈమ్యాటర్ చదివితే మీక్ అర్ధం అవుతుంది…అప్పట్లో 80 వ దశకంలో స్టార్స్ గా ఎదిగిన సౌత్ తారలు .. కలిసి రెగ్యులర్ గా గెట్ టు గెదర్ జరుపుకోవడం షరా మామూలే, చిరంజీవి, రజని కాంత్, ప్రభు, మోహన్ లాల్, రాధికా, సుమలత , రాధికా, సుహాసిని లాంటి తారలు కలిసి ఈ గెట్ టుగెదర్ ని నిర్వహిస్తారు .. ఎప్పటిలాగే ఈ సారి చైనా లో ఈ బ్యాచ్ ఫెస్టివల్ జరుపుకుందట. ఇక ఈ ఫెస్టీవెల్ లో ఉండిపోవడం వల్ల చిరు దాసరి యాత్రకి రాలేదంటా….అదీ మొత్తంగా మ్యాటర్.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.