Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?
- November 18, 2026 / 12:20 PM ISTByPhani Kumar
మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కి ఒక అలవాటు ఉంది. ఏ సినిమా వేడుకలో అయినా కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటాడు. ముఖ్యంగా స్టార్ హీరోలు ఎదురుగా ఉంటే కనుక తమన్‌ను ఆపలేం.! ‘ఈ సినిమాకి పనిచేస్తుంటే ఇష్టమైన బిర్యానీ తింటున్నట్టు ఉంటుంది’ లేదంటే ‘హోమ్ గ్రౌండ్‌లో సిక్స్ కొట్టినట్టు ఉంటుంది’ ‘కీబోర్డులు సరిపోవడం లేదు’ ‘సౌండ్ బాక్సులు పేల్తాయ్’.. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెబుతూ స్టార్స్ ముందు హైలైట్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.
Thaman

‘ఓజి’ సినిమా వచ్చేంత వరకు తమన్.. ఏ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్నా ఆ సినిమా గురించే డప్పు కొడుతూ వచ్చాడు. ఇప్పుడు ‘కాకా’ వంతు వచ్చింది. ఈ మధ్య తమన్ పాల్గొంటున్న ప్రతి సినిమా ఈవెంట్‌లోనూ ‘కాకా’ భజన చేస్తున్నాడు. ఇది మిగతా హీరోల అభిమానులకు విసుగు పుట్టిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై నెటిజన్లు నేరుగానే తమన్‌ను విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. బహుశా ఇది చిరు గమనించినట్టు ఉన్నారు.
నిన్న జరిగిన ‘ఇట్లు అర్జున’ సక్సెస్ మీట్‌లో ఈ విషయంపై నేరుగానే తమన్‌కి క్లారిటీ ఇచ్చారు చిరు. “తమన్ ఎక్కడికి వెళ్లినా సరే ‘కాకా.. కాకా’ అంటున్నాడు. నీకో ప్రమాదం ఉంది. నువ్వు అన్ని సినిమాల గురించి మాట్లాడితే మాట్లాడు.. లేదంటే మాట్లాడటం మానేయ్. ఎందుకంటే ‘మిగతావాళ్లు మా సినిమా గురించి చెప్పడం లేదు.. ‘కాకా’నే బాగుందా..? కాకానే కేకనా?’ అని అడుగుతున్నారు.ప్లీజ్ పబ్లిసిటీ తగ్గించు” అంటూ చిరు నిన్న స్టేజిపైనే తమన్‌కి చెప్పడం జరిగింది.
చిరు చెప్పింది నిజమే..! అన్ని సినిమాలకు పనిచేస్తున్నప్పుడు ఒక్క హీరో సినిమాకే భజన చేయడం కరెక్ట్ కాదు. ఆయా సినిమాల వేడుకల్లో ఎలాగూ వాటి గురించే మాట్లాడాలి..! డబ్బా కొట్టాలి..! అది ఎలాగూ తప్పదు..! కానీ మిగతా నిర్మాతలు తమ సినిమాల కోసం అంత ఖర్చు పెట్టి ఈవెంట్లు చేసుకుంటున్నప్పుడు, ఆ వేదికలపై వేరే సినిమాల గొప్పతనం గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు కదా..! చిరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని, తమన్‌ను కంట్రోల్‌లో పెట్టడానికే ఇలా మాట్లాడి ఉండొచ్చు.















