యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో షూటింగ్ కి బ్రేక్ పడింది. కొన్ని రోజుల క్రితం వరకు రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో ప్రభాస్, బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్, నీల్ తిన్ ముకేష్, చుంకే పాండే లపై యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. గతవారం నుంచి అమీర్ పేటలో వేసిన ఇంటి సెట్ లో హీరోయిన్ శ్రద్ధ కపూర్, ప్రభాస్ పై సన్నివేశాలు చిత్రీకరణ మొదలెట్టారు. అయితే నిన్న షూటింగ్ ని నిలిపివేశారట. అందుకు కారణం ప్రభాస్ అని తెలిసింది. లొకేషన్లో ప్రభాస్ అస్వస్థతకు గురికావడం వల్ల .. షూటింగ్ కి పేకప్ చెప్పి అతని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. వైద్యులు పరిశీలించి కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారంట.
డైట్ లో కొన్ని మార్పులు చేయడం వల్ల బడీ అందుకు సరిగ్గా రియాక్ట్ కాకపోవడంతో ప్రభాస్ నీరసమయ్యాడని, రెండు రోజులు సరైన డైట్, రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పడంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. హైదరాబాద్ లో షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే చిత్ర బృందం దుబాయ్ వెళ్లనుంది. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్ తో ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.