రీఎంట్రీకి మళ్ళీ ఎందుకు బ్రేకిచ్చిందా అనే ప్రశ్నకు సమాధానం

హీరోయిన్ గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డబుల్ డిజిట్ మూవీస్ చేసిన స్నేహ తాను ప్రేమించిన ప్రసన్న కుమార్ ను పెళ్లాడి సినిమాల నుంచి తాత్కాలిక బ్రేక్ తీసుకొని మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిన విషయం తెలిసిందే. వదిన, అత్త పాత్రలు చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్న స్నేహ మళ్ళీ సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడం వెనుక ఆంతర్యం ఎవరికీ అర్ధం కాలేదు. పోనీ ఆఫర్లు రావడం లేదా అంటే ఆమె ఉంటేనే సినిమా తీస్తామనే దర్శకులు ఆమె కోసం క్యూ కట్టారు. మరి సమస్య ఏమిటా అని ఆమె ప్రశ్నించగా.. చాలా సింపుల్ గా “నేను గర్భవతిని.. అందుకే బ్రేక్ తీసుకొన్నాను” అని సమాధానమిచ్చింది.

reason-behind-why-sneha-taken-break-from-her-re-entry1

2012లో ప్రసన్నను పెళ్లి చేసుకొన్న స్నేహ.. 2015లో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సన్నద్ధమవుతోంది. అందుకే సినిమాలకు మళ్ళీ బ్రేక్ ఇచ్చింది స్నేహ. ఆమె తెలుగులో చివరిగా “వినయ విధేయ రామ” చిత్రంలో రామ్ చరణ్ కు వదినగా కనిపించింది. మరి రెండో బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ సినిమాలకు పూర్తి సమయం కేటాయించగలుగుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus