అతిలోక సుందరి శ్రీదేవి శనివారం రాత్రి గుండెపోటుతో మరణించడంతో ఆమె కుటుంబసభ్యులు, అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఆమె కడసారి చూపు కోసం కోట్లమంది ఎదురుచూస్తున్నారు. అయినా ఆమె పార్థివదేహం ఇంతవరకు ముంబై కి రాలేదు. నిన్న(ఆదివారం) ఉదయం 11 గంటలకు వస్తుందని.. ఆ తర్వాత మధ్యహ్నం ఒంటిగంటకు..సాయంత్రం ఐదారు గంటలకన్నారు. చివరికి టైం మాత్రమే కాదు.. డేట్ కూడా మార్చేస్తూ.. సోమవారం ఉదయానికి వస్తుందని ప్రకటించారు. ఇంకా ఆమె భౌతిక కాయం భారత్ కు చేరలేదు. దీంతో శ్రీదేవి మరణం వెనుక ఏదైనా కుట్ర దాగుందని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటువంటిది ఏమీ లేదని శ్రీదేవి బంధువులు మీడియాకి తెలిపారు. దుబాయ్ చట్టాల కారణంగానే ఆలస్యం అవుతుందని వివరించారు. అక్కడి ఫార్మాలిటీస్ గురించి క్లుప్తంగా…
1. శ్రీదేవి మరణాన్ని తెలియజేసే ఫోరెన్సిక్ రిపోర్ట్ చేతికి వచ్చాక ఆమె శరీరానికి ఎంబ్లామింగ్ (శరీరం చెడిపోకుండా ఉంచే ప్రక్రియ) చేస్తారు. ఇందుకోసం 90 నిమిషాలు పట్టనుంది. ఈ ప్రక్రియ నిన్నే జరిగిపోయింది.
2. అనంతరం పోలీసులు శ్రీదేవి డెత్ సర్టిఫికెట్ ను జారీ చేస్తారు. ఇక్కడ కొంచెం ఆలస్యం జరిగింది.
3. ఇండియన్ కాన్సులేట్ దుబాయ్ ఆమె పాస్ పోర్ట్ ను రద్దు చేస్తారు.
4. శ్రీదేవి పార్థిపదేహాన్ని వారి కుటుంబానికి అప్పగించేందుకు అక్కడి లాయర్ అనుమతి ఇవ్వాలి.
5. అనంతరం ఎయిర్ పోర్ట్ కు శ్రీదేవి భౌతికకాయాన్ని తరలిస్తారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న ప్రైవేట్ చాఫ్టర్ లో ఇండియాకు నిర్జీవ అతిలోక సుందరిని తీసుకురానున్నారు.