ఈ ఏడాది విడుదలై ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సినిమాలలో థాంక్యూ సినిమా ఒకటి. వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న నాగచైతన్యకు ఈ సినిమా ఫలితం షాకిచ్చింది. ఫుల్ రన్ లో ఈ సినిమా 5 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను కూడా సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. థాంక్యూ మూవీ విడుదలైన మూడు వారాల గ్యాప్ లోనే నాగచైతన్య నటించిన లాల్ సింగ్ చద్దా థియేటర్లలో విడుదల కానుంది.
లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగచైతన్య రోల్ ఫుల్ లెంగ్త్ రోల్ కాకపోయినా నాగచైతన్య ఈ సినిమాతోనే బాలీవుడ్ కు పరిచయమవుతూ ఉండటంతో చైతన్య అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగచైతన్య సైతం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. థాంక్యూ సినిమా ఫలితం షాకింగ్ గా మరియు భయానకంగా ఉందని నాగచైతన్య చెప్పుకొచ్చారు. లాల్ సింగ్ చద్దా మూవీ వల్ల థాంక్యూ మూవీని ప్రాసెస్ చేయడానికి ఎక్కువ సమయం లేదని నాగచైతన్య పేర్కొన్నారు.
నేను చూసినంత వరకు థాంక్యూ మూవీ రచన విషయంలో కూడా లోపాలు ఉన్నాయని నాగచైతన్య చెప్పుకొచ్చారు. థాంక్యూ సినిమా ఫ్లాప్ అని నాగచైతన్య డైరెక్ట్ గానే క్లారిటీ ఇచ్చారు. నాగచైతన్య తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. కెరీర్ విషయంలో నాగచైతన్య ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నాగచైతన్య వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఒక సినిమాకు, పరశురామ్ డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలలో ఒక సినిమా సక్సెస్ సాధించినా నాగచైతన్య కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు. నాగచైతన్య కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాగచైతన్య ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.