Jr NTR: నెల రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఇంత మార్పా?

  • September 4, 2022 / 02:41 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో పాత్రకు అనుగుణంగా లుక్ ను మార్చుకునే అతికొద్ది మంది హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరనే సంగతి తెలిసిందే. నవంబర్ నెల నుంచి తారక్ కొరటాల శివ కాంబో మూవీ షూటింగ్ మొదలుకానుండగా ఈ సినిమా కోసం తారక్ బరువు తగ్గుతున్నారు. అయితే నెలరోజుల క్రితం జరిగిన బింబిసార ఈవెంట్ లో బొద్దుగా కనిపించిన తారక్ బ్రహ్మాస్త్రం ప్రెస్ మీట్ లో మాత్రం స్లిమ్ లుక్ లో కనిపించి మెప్పించారు.

తారక్ ను ఎలాంటి లుక్ లో చూడాలని కోరుకున్నామో తారక్ అలానే ఉన్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రెస్ మీట్ లో ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నా అందరి చూపు తారక్ పై మాత్రమే ఉంది. కొత్త లుక్ లో అదుర్స్ అనేలా ఉన్న తారక్ ఇదే లుక్ తో సినిమాలో నటిస్తే బాగుంటుందని మరి కొందరు అభిమానులు సూచిస్తున్నారు. భారీగా కసరత్తులు చేసి తారక్ తన లుక్ ను మార్చుకున్నారని చెప్పాలి.

కొరటాల శివ తారక్ కాంబో మూవీ ఆలస్యం అవుతున్నా అభిమానులు ఫీల్ కావాల్సిన అవసరం లేదని ఎదురుచూపులకు తగిన ఫలితం కచ్చితంగా లభిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొరటాల శివ ఈ సినిమా కోసం గత సినిమాలను మించి కసితో పని చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ ను పూర్తి చేసి 2023 సమ్మర్ నుంచి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో తారక్ బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.

2023 సంవత్సరంలో తారక్ కొరటాల కాంబో మూవీ రిలీజ్ కానుండగా 2024 సంవత్సరంలో తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ రిలీజ్ కానుంది. వరుసగా ఆరు విజయాలను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus