నా బోయ్ ఫ్రెండ్ ని వదిలేసా – రేజీనా!!!

మన టాలీవుడ్ లో హీరో హీరోయిన్ కలిసి చేసిన ఒక సినిమా భారీ హిట్ అయ్యింది అంటే చాలు…ఆ ఇద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్ అని వెనువెంటనే మరికొన్ని సినిమాలను సైతం సెంటిమెంటల్ గా తెరకెక్కించేస్తారు మన దర్శక నిర్మాతలు. అయితే అప్పట్లో బాలకృష్ణ- విజయశాంతి, చిరంజీవి-రాధ,కృష్ణ-శ్రీదేవి, శోభన్ బాబు-జయప్రద వీళ్ళ కాంబినేషన్స్ సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్స్ గా నిలిచాయి. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన కాంబినేషన్స్ లో మన మెగా మేనల్లుడు సాయిధర్మతేజ, అందాల భామ రేజీన కాంబినేషన్ సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా సాయి ధర్మ తేజను స్టార్ హీరోగా నిలబెట్టింది. అదే క్రమంలో ఈ ఇద్దరు జంట అద్భుతమైన విజయం సాధిస్తుందన్న అన్న టాక్ టాలీవుడ్ లో చక్కెర్లు కొట్టింది. అంతే కాదు ఈ ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ఔట్ అయ్యిందని..ఇద్దరూ ప్రేమలో సైతం పడ్డారని గుసగుసలు వినిపించాయి కూడా.

అయితే వాటన్నింటినీ కొట్టి పారెస్తు అవన్నీ రూమర్స్ అని తెలిపారు ఆ ఇద్దరూ. అంతేకాకుండా మేమిద్దరం మంచి స్నేహితులం అని సైతం తెలిపారు. అయితే అంతవరకూ భాగానే ఉంది కానీ, అసలు ట్విష్ట్ ఇక్కడే మొదలయింది. నిన్న మొన్నటి వరకు తనకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ లేరని భింకాలకు పోయిన రెజీనా ఒక్కసారే బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పానని మీడియాకు తెలిపింది. ఇక ఈ వార్తపై ఇండస్ట్రీ మొత్తం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రేజీనా తన బోయ్ ఫ్రెండ్ ని వదిలేసింది అంటే సాయి తో ఏవో గొడవలు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ మొత్తానికైతే సాయి ధర్మ తేజ కి, రేజీనాకి ఎక్కడో తేడా వచ్చినట్లు మాత్రం స్పష్టంగా అర్ధం అవుతుంది. చూడాలి ఇంకెన్ని విచిత్రాలు బయటపడతాయో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus