Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 6, 2026 / 12:00 PM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సూర్య‌ (Hero)
  • న‌జ్రియా న‌జీమ్‌ (Heroine)
  • న‌స్లీన్‌, ఆనంద్ రాజ్‌, లాల్‌, టోవినో థామ‌స్‌, జ్యోతిక త‌దిత‌రులు (Cast)
  • జీతూ మాధ‌వ‌న్‌ (Director)
  • సూర్య‌, జ్యోతిక‌ (Producer)
  • సుశిన్ శ్యామ్ (Music)
  • వినీత్ ఆగ‌స్టీన్‌ (Cinematography)
  • అజ్మ‌ల్ స‌బు (Editor)
  • Release Date : 6th న‌వంబ‌ర్‌ 2026
  • జఘరం స్టూడియోస్, 2D ఎంటర్‌టైన్‌మెంట్ (Banner)

సూర్య సినిమా అంటేనే కొత్త‌ద‌నం ఉంటుంద‌ని అభిమానులు న‌మ్ముతుంటారు. క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల్లో ఏదో ఒక డిఫ‌రెంట్ పాయింట్‌ను ట‌చ్ చేస్తూ సినిమాలు చేస్తుంటారు సూర్య‌. “సీన్” (Scene) సినిమాతో వెరైటీ ప్ర‌యోగం చేశారు. ఆవేశం, రోమాంచం ఫేమ్ జీతూ మాధ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీలో న‌జ్రియా న‌జీమ్ హీరోయిన్‌గా న‌టించింది. ప్రేమ‌లు ఫేమ్ న‌స్లీన్ విల‌న్‌గా క‌నిపించాడు. భార్య జ్యోతిక‌తో క‌లిసి సూర్య స్వ‌యంగా నిర్మించిన సీన్ సినిమా శుక్ర‌వారం తెలుగుతో పాటు త‌మిళంలో రిలీజైంది? సీన్‌తో హీరోగా, ప్రొడ్యూస‌ర్‌గా సూర్య‌కు హిట్టు ద‌క్కిందా? లేదా? అంటే?

Scene Movie Review

Scene Movie Review And Rating1

క‌థ‌: ప్రేమ్‌రాజ్ (సూర్య‌) ఓ పోలీస్ ఆఫీస‌ర్‌. క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేస్తుంటాడు. త‌న తెలివితేట‌ల‌తో ఎన్నో క్లిష్ట‌మైన కేసుల‌ను సాల్వ్ చేస్తాడు. త‌న‌కున్న స‌మ‌స్య కార‌ణంగా ప్రేమ్‌రాజ్ కంటిచూపు క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గిపోతుంది. తాను గుడ్డివాడు అనే నిజం బ‌య‌ట‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతుంటాడు. విక్ట‌ర్ (టోవినో థామ‌స్‌) అనే సీరియ‌ల్ కిల్ల‌ర్ కార‌ణంగా ఈ నిజం క్రైమ్ బ్రాంచ్ హెడ్ స్టీఫెన్‌కు తెలిసిపోతుంది. ప్రేమ్‌రాజ్‌ను ఉద్యోగం నుంచి తీసేస్తాడు. అదే టైమ్‌లో సిటీలో ఒకే త‌ర‌హాలో ఓ కిల్ల‌ర్ వ‌రుస‌గా హ‌త్య‌లు చేస్తుంటాడు. త‌న‌పై వ‌చ్చిన కొన్ని అబ‌ద్ద‌పు ఆరోప‌ణల కార‌ణంగా పోలీస్ జాబ్ లేక‌పోయినా ఈ కేసును సాల్వ్ చేస్తాన‌ని స్టీఫెన్‌తో ప్రేమ్‌రాజ్‌ ఛాలెంజ్ చేస్తాడు. ఈ సీరియ‌ల్ కిల్ల‌ర్ కేసు ఇన్వేస్టిగేష‌న్‌లో అత‌డికి సాయం చేయ‌డానికి మాయ (న‌జ్రియా న‌జీమ్‌) ఒప్పుకుంటుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా హ‌త్య‌లు చేస్తున్న‌ తెలివిప‌రుడైన కిల్ల‌ర్‌ ఈశ్వ‌ర్‌ను కంటిచూపులేని ప్రేమ్‌రాజ్ ఎలా ప‌ట్టుకున్నాడు? మాయ‌తో ప్రేమ్‌రాజ్‌కు ఏర్ప‌డిన ప‌రిచ‌యం ఎలా ప్రేమ‌గా మారింది? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Scene Movie Review And Rating1

న‌టీన‌టుల ప‌నితీరు: అంధుడైన పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో సూర్య జోవియ‌ల్ యాక్టింగ్ క‌న‌బ‌రిచాడు. అత‌డి లుక్ స్టైలిష్‌గా ఉంది. సూర్య కెరీర్‌లో ఇదొక ప్ర‌యోగంగా చెప్ప‌వ‌చ్చు.మాస్‌, క్లాస్ ఇమేజ్ ఉన్న హీరోను పెట్టుకొని హీరోయిన్ చేత ఫైట్లు చేయిస్తే ఫ్యాన్స్ ఒప్పుకోర‌నే అనుమానాలు వ‌స్తాయి. ఎలివేష‌న్లు, రొమాంటిక్ సీన్లు, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌కు దూరంగా సాగే ఈ క్యారెక్ట‌ర్‌లో న‌టించ‌డానికి సూర్య లాంటి స్టార్ అంగీక‌రించ‌డం అంటే పెద్ద సాహ‌స‌మే. జీతూ మాధ‌వ‌న్ క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డంతో సూర్య క‌ష్టం వృథాగా మారింది. ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైన‌స్ విల‌న్‌. న‌స్లీన్‌లో ఏ కోశ‌న విల‌న్ ఛాయ‌లు క‌నిపించ‌లేదు.

సీరియ‌ల్ కిల్ల‌ర్ సినిమాల్లో హీరో, విల‌న్ల మ‌ధ్య పోరును ఆస‌క్తిక‌రంగా రాసుకోక‌వాలి. విల‌న్ వేసే ఎత్తుల‌ను హీరో క‌నిపెట్టే సీన్లు ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటే సినిమా అంతగా ఆక‌ట్టుకుంటుంది. ఆ థ్రిల్ ఈ సినిమాలో మిస్స‌య్యింది. న‌జ్రియా న‌జీమ్ క్యూట్ ప‌ర్ఫార్మెన్స్‌ను క‌న‌బ‌రిచింది. ఆనంద్‌రాజ్‌, లాల్‌తో పాటు పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల్లో క‌నిపించిన ఇద్ద‌రు న‌టుల కామెడీ అక్క‌డ‌క్క‌డ న‌వ్వించింది. జ్యోతిక తో పాటు మ‌ల‌యాళం హీరో టోవినో థామ‌స్ గెస్ట్ రోల్స్‌లో క‌నిపించారు.

Scene Movie Review And Rating1

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాలు చాలా సీరియ‌స్‌గా సాగుతాయి. ఈ జాన‌ర్‌లో కామెడీకి స్కోప్ త‌క్కువే. కానీ ఈ ట్రెండ్‌ను సీన్ మూవీతో తిర‌గ‌రాయాల‌ని అనుకున్నాడు డైరెక్ట‌ర్ జీతూ మాధ‌వ‌న్‌. త‌న గ‌త సినిమాల త‌ర‌హాలోనే న‌వ్విస్తూనే తాను చెప్పాల‌నుకున్న క‌థ‌ను స్క్రీన్‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఎంచుకున్న క‌థ‌లోని లాజిక్ లేక‌పోవ‌డంతో, కామెడీని స‌రిగ్గా రాసుకోలేక‌పోవ‌డంతో అత‌డి ప్ర‌యోగం అంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. సుశీన్ శ్యామ్ మ్యూజిక్ తేలిపోయింది. థ్రిల్ల‌ర్‌, కామెడీ ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో అర్థం కానీ క‌న్ఫ్యూజ‌న్‌లో ఏదేదో కొట్టేశాడు. వినీత్ అగ‌స్టీన్ సినిమాటోగ్ర‌ఫీ ఒకే. సినిమా ర‌న్‌టైమ్ రెండు గంట‌ల ఇర‌వై తొమ్మిది నిమిషాలే. కానీ సాగ‌తీత సీన్ల కార‌ణంగా చాలా పెద్ద సినిమాలా అనిపిస్తుంది. సీన్ సినిమాను త‌న భార్య జ్యోతిక‌తో క‌లిసి సూర్య స్వ‌యంగా నిర్మించాడు. సినిమా బ‌డ్జెట్ చాలా త‌క్కువే. స‌గానికిపైగా మూవీ ఒకే ఇంట్లో సాగుతుంది.

Scene Movie Review And Rating1

విశ్లేష‌ణ‌: అప్పుడ‌ప్పుడు హీరోలు క‌థ‌, పాత్ర‌ల ప‌రంగా ప్ర‌యోగాలు చేయ‌డం మంచిదే. ఇమేజ్ ఛ‌ట్రం నుంచి బ‌య‌ట‌ప‌ట‌డ‌మే కాకుండా న‌ట‌నాప‌రంగా త‌మ‌లోని కొత్త కోణాల‌ను ఆవిష్క‌రించుకునే అవ‌కాశం ఈ ప్ర‌యోగాల‌తో దొరుకుంది. కానీ అందుకు త‌గ్గ క‌థ‌, ద‌ర్శ‌కులు దొర‌క‌డం కూడా ముఖ్య‌మే. సూర్య ఆలోచ‌న బాగుంది. డైరెక్ట‌ర్ జీతూ మాధ‌వ‌న్ నుంచే అత‌డికి స‌రైన స‌పోర్ట్ దొర‌క‌లేదు.

రొమాంచం, ఆవేశం సినిమాల్లో సీరియ‌స్ క‌థ‌ల్లో కామెడీని ప‌ర్‌ఫెక్ట్‌గా బ్లెండ్ చేసి ఆడియెన్స్‌ను మెప్పించాడు జీతూ మాధ‌వ‌న్‌. కానీ ఇందులోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయ‌బోయి బోర్లాప‌డ్డాడు. కామెడీ అస్స‌లు వ‌ర్క‌వుట్ కాలేదు. పోనీ క్రైమ్ క‌థ‌ను అయినా స‌రిగ్గా రాసుకున్నాడా అంటే అదీ లేదు. పోలీస్ ఇన్వేస్టిగేషన్ పేరుతో సూర్య చేసే హ‌డావిడి, కిల్ల‌ర్‌ను ప‌ట్టుకోవ‌డానికి అత‌డు వేసే ఎత్తులు సిల్లీగా అనిపిస్తాయి. సూర్య‌ను హైలైట్ చేయ‌డానికి మిగిలిన పోలీసుల‌ను కామెడీగా చూపించ‌డం బాగాలేదు. సినిమా మొత్తం బ్లైండ్ స్కూల్ టీచ‌ర్‌లా మాయ పాత్ర స‌ల‌హాలు ఇస్తూనే ఉంటుంది.

సూర్య‌, న‌జ్రీయా న‌జీమ్‌తో పాటు సినిమాలు క‌నిపించే మెయిన్ పాత్ర‌ల‌న్నింటికి ఏదో ఒక స‌మ‌స్య ఉంటుంది. ఎలా ఎందుకు అన్న‌ది చూపించ‌లేదు. ఆ స‌మ‌స్య‌ల నుంచి కామెడీని జ‌న‌రేట్ చేసిన తీరు కూడా క‌న్వీన్సింగ్‌గా అనిపించ‌దు.

Scene Movie Review And Rating1

ఫోక‌స్ పాయింట్‌: “సీన్” రివ‌ర్స్‌…న‌వ్వులు, ఉత్కంఠ రెండు లేని క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ….

రేటింగ్‌: 1.5/5

 

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jithu Madhavan
  • #Naslen
  • #Nazriya Nazim
  • #Scene Movie
  • #Suriya

Reviews

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

trending news

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

51 mins ago
Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

4 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

22 hours ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

22 hours ago

latest news

Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

2 hours ago
Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

3 hours ago
Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

Sai Durgha Tej: ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

5 hours ago
Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

23 hours ago
Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version