అబ్బో అన్నవాళ్ళందరికీ షాక్ ఇచ్చింది!

ఇటీవలకాలంలో సరైన విజయం దొరక్క కథానాయికగా ఢీలా పడిన రెజీనా కస్సాండ్రా తెలుగులో అవకాశాల్లేక తమిళనాట సినిమాలు చేసుకుంటూ కెరీర్ ను నెట్టుకొస్తుంది. మొన్నామధ్య విడుదలైన “బాలకృష్ణుడు”లో అందాలు ఆరబోసినప్పటికీ సినిమా ఫ్లాపవ్వడంతో ఆమెను ఎవరూ అంతగా పట్టించుకోలేదు. అయితే.. నిన్న విడుదలైన “అ!” సినిమాలో రెజీనా లుక్ మాత్రం ఆడియన్స్ ను మాత్రమే కాక పరిశ్రమకు చెందినవారిని కూడా విపరీతమైన ఆశ్చర్యానికి గురించేసింది. టిపికల్ హెయిర్ కట్ తో, బాడీ మొత్తం టాటూస్, ముక్కెరతో ఆశ్చర్యానికి గురి చేసింది.

అయితే.. “అ!” సినిమాలోని ఆ లుక్ నిజానికి ఆ సినిమా కోసం మాత్రమే చేసింది కాదట. తమిళంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పార్టీ” సినిమా కోసం రెజీనా ట్రై చేసిన లుక్ అది. ఆల్రెడీ ఆ సినిమా టీజర్ మొన్న విడుదలైంది. నిన్న రెజీనా లుక్ ఏదో బాగుంది అని అందరూ అనుకొనేలోపే.. అది ఈ సినిమా కోసం చేసిన లుక్ కాదు “పార్టీ” సినిమాలో లుక్ ఈ చిత్రానికి కూడా చిన్న మేకప్ టచ్ ఇచ్చి కంటిన్యూ చేశారని తెలియడంతో కాస్త నిరాశ చెందారు. ఏదైతే ఏముంది.. రెజీనా లుక్ మాత్రం అదిరింది. అయితే.. అది ఈ సినిమా కోసం చేసి ఉంటే ఇంకాస్త బాగుండేది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus