లెక్క ప్రకారమైతే ఈ శుక్రవారానికే.. అంటే మే 31 కే విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ రీషూట్లు కారణంగా జులై 26 కి పోస్ట్ పోన్ అయ్యింది. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే అదే కాస్త బెటర్ అనే ఫీలింగ్ కలుగక మానదు. ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉండడంతో ‘నూన్ షోస్’ అన్నీ ‘నిల్’ గా కనిపిస్తున్నాయి. అందులోనూ ఈనెల 30 నుండీ వరల్డ్ కప్ కూడా మొదలవుతుంది. సో వీటి ఎఫెక్ట్ కచ్చితంగా ‘డియర్ కామ్రేడ్’ కలెక్షన్ల పై పడేది అనడంలో సందేహం లేదు. ఇలాంటి టైములో కూడా మూడు సినిమాలు ఇదే డేట్ కు వస్తున్నాయి.
ఇందులో సూర్య నటిస్తున్న ‘ఎన్జీకే’,’ఫలక్ నుమా దాస్’,’అభినేత్రి2′, వంటి చిత్రాలు ఉన్నాయి. ఇందులో ‘ఫలక్ నుమా దాస్’ చిత్రానికి తప్ప మిగిలిన చిత్రాలకి పెద్దగా క్రేజ్ లేదు. ఇవన్నీ ముందుగానే పసిగట్టి రౌడీ అండ్ టీం వెనక్కి జరిగినట్టు ఉన్నారు. ఏదైతేనేం మొత్తానికి ‘డియర్ కామ్రేడ్’ చిత్రం పోస్ట్ పోన్ అవ్వడం మంచిదే అయ్యింది.