మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాను 100 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందించాలని భావించారు. బ్రహ్మోత్సవం ఫ్లాప్ టాక్ తో ఆ ఆలోచన విరమించుకుంటారని అనుకున్నారు. కానీ మురుగదాస్ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. తను మొదట అనుకున్నట్లుగానే 100 కోట్ల బడ్జెట్ తోనే ఈ సినిమా తీయబోతున్నాడు.
ఈ నెల 29 నుండి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా మొదలవ్వక ముందే 150 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్లుగా ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది. రిలయన్స్ సంస్థ ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్స్ థియేట్రికల్ రైట్స్ తో పాటు శాటిలైట్ రైట్స్ కూడా కలుపుకొని మొత్తం 150 కోట్ల రూపాయలను ఆఫర్ చేశారట. మురుగదాస్ కు ఉన్న క్రేజ్, మహేష్ బాబు ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తుండడంతో ఇంత భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లుగా అభిప్రాయపడుతున్నారు.