Chiranjeevi, Ram Charan: రెమ్యూనరేషన్ల గురించి చరణ్‌ మాటలు విన్నారా?

‘ఆచార్య’ సినిమా ప్రమోషన్స్‌ ఫుల్‌ స్వింగ్‌లో సాగుతున్నాయి. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. సినిమాలో ఇద్దరి పాత్రలు ఎలా ఉంటాయి… ముందేమనుకున్నారు, ఇప్పుడేం జరిగింది అంటూ చాలా విషయాలు చెప్పుకొస్తున్నరు చిరంజీవి, కొరటాల శివ, రామ్‌చరణ్‌. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్‌చరణ్‌ మాట్లాడుతూ సినిమాలో రెమ్యూనరేషన్ల గురించి కూడా మాట్లాడారు. దీంతో ఆ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘ఆచార్య’ సినిమా పోస్టర్‌ మీద మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ అని ఉంటుంది.

Click Here To Watch NOW

అయితే ఇద్దరు నిర్మాతలు అనుకోవడానికి లేదు. ఎందుకంటే మొత్తం నిర్మాణ వ్యవహారాలు మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ వాళ్లే చూసుకున్నారు అని ఆ మధ్య రామ్‌చరణ్‌ స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు సినిమా కోసం తాము ఎలాంటి రెమ్యూనరేషన్లు తీసుకోలేదని చెప్పి షాక్‌ ఇచ్చారు రామ్‌చరణ్‌. సినిమాలో అందరి రెమ్యూనరేషన్ల గురించి చెప్పకపోయినా చిరు, చరణ్‌ రెమ్యూనరేషన్ లెక్క తెలిసింది. ‘ఆచార్య’ కోసం నేను, నాన్న ఎలాంటి డబ్బులు తీసుకోలేదు అని రామ్‌చరణ్‌ చెప్పడం గమనార్హం.

అయితే ఎందుకు తీసుకోలేదు అనే విషయాన్ని రామ్‌చరణ్‌ చెప్పలేదు. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ను సినిమాకు అటాచ్‌ చేయడం వల్ల లాభాల్లో వాటా తీసుకుంటారు అనేది ఓ టాక్‌. ఆ లెక్కన సినిమాకు పారితోషికం తీసుకోలేదు అని తెలుస్తోంది. టాలీవుడ్‌లో ఇలా లాభాల వాటా కార్యక్రమం జరుగుతోంది. రామ్‌చరణ్‌, చిరంజీవి ఇప్పుడు అదే చేశారు అంటున్నారు. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ఇందులో రామ్‌చరణ్‌ పాత్ర 45 నిమిషాలు ఉంటుందట.

తొలుత ఈ పాత్ర 15 నిమిషాలే అనుకున్నా… ఆ తర్వాత దాన్ని 45 నిమిషాలకు పెంచారట. అయితే ఈ పొడిగింపు ఎంతవరకు ఫలిస్తుంది అనేది చూడాలి. ఎంత తండ్రీ కొడుకులు సినిమా అయినా.. ఏ ఒక్కరి పాత్ర తగ్గినా ఫ్యాన్స్‌ అయితే తట్టుకోలేరు. మరి దీన్ని కొరటాల శివ ఎలా హ్యాండిల్‌ చేశారు అనేది ఈ నెల 29న తెలుస్తుంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus