Renu Desai: సాయం చేయండి అంటూ వేడుకుంటున్న రేణు దేశాయ్!

  • November 1, 2023 / 04:38 PM IST

రేణు దేశాయ్ ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు ఈమె పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా అందరికీ ఎంతో సుపరిచితమే పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయి ఒంటరిగా తన పిల్లల బాగోగులను చూసుకుంటూ ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా పిల్లలతో కలిసి ఉంటున్నటువంటి రేణు దేశాయ్ నిత్యం తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇలా పిల్లలకు సంబంధించిన కొన్ని విషయాలలో ఈమె తరచూ పవన్ కళ్యాణ్ అభిమానులతో ఫైట్ చేయాల్సిన పరిస్థితిలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఇలా తరచు ఏదో ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె చాలా రోజుల తర్వాత ఏకంగా వెండి తెరపై సందడి చేశారు. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాలో హేమలత లవణం అనే పాత్రలో రేణు దేశాయ్ నటించారు. ఇక ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది అని చెప్పాలి.

ఇకపై మంచి కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలు గనక వస్తే తాను తప్పకుండా నటిస్తాను అంటూ రేణు దేశాయ్ వెల్లడించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. రేణు దేశాయ్ కి మూగజీవాలు అంటే ఎంతో అమితమైన ప్రేమ అనే విషయం మనకు తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎన్నో రకాల జంతువులను పెంచుతున్నారు. అయితే తాజాగా మూడు కుక్కలకు ఆపరేషన్ చేయడం కోసం ఒక సంస్థ విరాళాలు అడుగుతున్నారు.

ఈ విధంగా కుక్కల ఆపరేషన్ కోసం విరాళం అడగడంతో తన వంతుగా రేణుదేశాయ్ ఏకంగా 30 వేల రూపాయలు విరాళం అందించారు. ఈ ఆపరేషన్ కోసం 55వేల రూపాయలు ఖర్చుకాగా ఈమె తన వంతుగా 30వేలు సహాయం చేశానని, మిగిలినది ప్రతి ఒక్కరూ సాయం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ వంద రూపాయలు చొప్పున ఇచ్చి వాటి ప్రాణాలను కాపాడండి అంటూ ఈమె (Renu Desai) సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus