మగాడు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చా?

  • October 4, 2017 / 10:45 AM IST

“మహిళా సమానత్వం” అని మాట్లాడుకోవడం తప్ప ఆ విషయాన్ని ఆచరణలో పెట్టడం మాత్రం పొరపాటున కూడా చేయం. ఈ విషయాన్నే కాస్త ఘాటుగా మరోమారు గుర్తుచేసింది పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్. ఆమె మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో “ఇప్పటివరకూ నేను రెండో పెళ్లి గురించి ఆలోచించలేదు, కానీ ఇప్పుడు నాకంటూ ఒక తోడు ఉంటే బాగుండు అనిపిస్తుంది” అని సమాధానమిచ్చింది. ‘

ఈ విషయమై కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెగిటివ్ గా స్పందించారు. మా అన్నయ్య ఉండగా నువ్వు ఇంకొకర్ని పెళ్లాడాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అని మొదలుకొని బూతులు కూడా తిట్టడం మొదలెట్టారు. మామూలుగా అయితే ఇలాంటి విషయాలను పట్టించుకోని రేణు దేశాయ్ ఈ విషయమై మాత్రం గట్టిగానే స్పందించింది. “ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం, ఒక మగాడు ఎన్ని పెళ్లిళ్లు చేసుకొన్నా పర్లేదు కానీ.. ఒక సింగిల్ లేడీ తోడు కోరుకోవడం మాత్రం పెద్ద తప్పుగా చూస్తున్నారు? ఇదేం న్యాయం, ఆడవాళ్ళకి సమానత్వం కావాలని ధర్నాలు చేయడం కాదు దాన్ని ఆచరణలో పెట్టడం నేర్చుకోండి” అంటూ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఇప్పుడా పోస్ట్ వైరల్ అయ్యింది. ఆ పోస్ట్ చూసైనా ఆ కొందరు పవన్ వీరాభిమానులు తమ వ్యవహారశైలి మార్చుకోంటారేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus