పవన్ కళ్యాణ్ తో రేణు డైవర్స్ తీసుకున్న కారణం

  • March 11, 2017 / 06:26 AM IST

బద్రి.. ఒకే ఒక్క సినిమాతో యువకుల హృదయాలను కొల్లగొట్టిన భామ రేణు దేశాయ్. అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనసుని దోచుకుంది. వారిద్దరూ కొంతకాలం సహజీవనం చేసుకుని.. భార్యాభర్తలు కాకుండానే తల్లిదండ్రులు అయ్యారు. అనంతరం పెళ్లి చేసుకొని అన్యోన్యంగా కలిసి జీవించారు. కానీ సడన్ గా విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎందుకు డైవర్స్ తీసుకోవాలి వచ్చింది అనే సంగతి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ విషయం పై పవన్, రేణు ఎప్పుడూ నోరు మెదపలేదు. మహిళా దినోత్సవం సందర్భం గా రేణు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె ముందు ఇదే ప్రశ్నను ఉంచగా దానిపై స్పందించారు.

‘పవన్‌ నుంచి విడిపోయినా ఆయన నాకు ఎప్పుడూ గురువే. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఇప్పటికీ ఆయనతో కలిసి బయట తిరుగుతుంటా. దీంతో నా ఫ్రెండ్స్‌ అందరూ అడుగుతుంటారు. ‘ఇంత క్లోజ్‌గా ఉంటున్నారు కదా.. మరి, విడాకులు ఎందుకు తీసుకున్నారు’ అని. విడాకులు తీసుకోవడానికి నా రీజన్స్‌ నాకు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చెప్పలేను. కానీ, కచ్చితంగా నేను త్వరలో రాయబోయే ఆత్మకథలో పవన్‌తో విడిపోవడానికి దారి తీసిన పరిస్థితులను వెల్లడిస్తాన’ని వివరించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus