వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి పెళ్లి నవంబర్ 1 వ తేదీ ఇటలీలో జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక వీరి వివాహం జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీ చేరుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తన మూడవ భార్యతో కలిసి ఇటలీ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా రేణు దేశాయ్ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆమెకు ఈ పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
వరుణ్ తేజ్ వివాహానికి మీరు వెళ్తున్నారా అంటూ రేణు దేశాయ్ కి ప్రశ్న ఎదురవడంతో తాను వెళ్లలేదు అంటూ సమాధానం చెప్పారు. నేను నీహా పెళ్లికి కూడా వెళ్లలేదు. ఇప్పుడు కూడా తాను వరుణ్ తేజ్ పెళ్లికి వెళ్లడం లేదు అంటూ ఈమె తెలియజేశారు. నేను కనుక వరుణ్ తేజ్ పెళ్లికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతారు. అందుకే వెలదలచుకోలేదు అంటూ ఈమె తెలియజేశారు.
ఇక నిహారిక వివాహానికి రేణు దేశాయ్ పిల్లలు ఆఖీరానందన్ ఆద్య పవన్ కళ్యాణ్ తో కలిసి హాజరైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈసారి వరుణ్ తేజ్ వివాహానికి తన పిల్లలు కూడా దూరంగానే ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు అయితే వీరిద్దరూ ఇటలీ వెళ్ళలేదు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన మూడవ భార్యతో కలిసి ఇప్పటికే ఇటలీ చేరుకున్నారు. కనుక బహుశా వీరు వెళ్లే అవకాశాలు కూడా లేవని తెలుస్తుంది.
ఇక వరుణ్ తేజ్ గురించి రేణు దేశాయ్ మాట్లాడుతూ వరుణ్ తేజ్ నా కళ్ళముందే పెరిగాడు. నేను తనకు ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అక్కడికి వెళ్లానని చాలా మంచి వ్యక్తి అంటూ రేణు దేశాయ్ వెల్లడించారు. తనకు ఎప్పుడు నా బ్లెస్సింగ్స్ ఉంటాయని ఈమె ఆశీర్వదించారు. మొత్తానికి వరుణ్ తేజ్ వివాహానికి (Renudesai) రేణు దేశాయితో పాటు తన పిల్లలు కూడా దూరంగా ఉన్నారని తెలుస్తోంది.