Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

‘సలార్’ ‘కల్కి 2898 ad’ వంటి సూపర్ హిట్లతో ప్రభాస్ ఫామ్లోకి వచ్చారు. అతని నుండి రాబోతున్న నెక్స్ట్ మూవీ ‘ది రాజాసాబ్’. ఏప్రిల్ లో రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయ్యింది. మరోపక్క ‘ది రాజాసాబ్’ సాంగ్స్ చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా 4 సాంగ్స్ షూట్ చేయాలి. ఇటీవల తెలుగు సినీ ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె బాట పట్టడం వల్ల ‘ది రాజాసాబ్’ షూటింగ్ నిలిచిపోయింది.

Rajasaab

తమ వేతనాలు 30 శాతం పెంచాలని వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేయడం జరిగింది. అయితే దీనిని నిర్మాత విశ్వప్రసాద్ వ్యతిరేకించారు. తెలుగు సినీ ఫెడరేషన్ వర్కర్స్ డిమాండ్స్ న్యాయం లేదని, అదొక మాఫియా మాదిరి తయారయ్యిందని,ఆ అసోసియేషన్లో లక్షలు పెట్టి మెంబర్షిప్ తీసుకుంటేనే పనిలోకి రానిస్తారని, వీళ్ళ వల్ల టాలెంటెడ్ పీపుల్ కి అన్యాయం జరుగుతుందని.. తన అభిప్రాయాన్ని వెల్లడించారు ‘రాజాసాబ్’ నిర్మాత ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ అధినేత అయిన టి.జి.విశ్వప్రసాద్.

దీంతో ఫెడరేషన్ వర్కర్స్ విశ్వప్రసాద్ పై మండిపడ్డారు. ఆయనకు లీగల్ నోటీసులు పంపారు. అయితే ఇప్పుడు సమ్మె విరమించుకోవడం జరిగింది. షూటింగులు మొదలయ్యాయి. కానీ ‘రాజాసాబ్’ షూటింగ్లో మేము పాల్గొనమంటూ ఫెడరేషన్ వర్కర్స్ నిర్ణయించుకున్నారట. విశ్వప్రసాద్ కూడా మొండిఘటం అనే చెప్పాలి. అవసరమైతే పక్క రాష్ట్రాల నుండి జనాలను తెప్పించుకుని షూటింగ్లు నిర్వహించడానికి కూడా ఆయన వెనుకాడరు. కాకపోతే ఈయన బ్యానర్లో పెద్ద సినిమాలు రూపొందుతున్నాయి. ముఖ్యంగా ‘రాజాసాబ్’ వంటి సినిమా కంప్లీట్ అయ్యి బయటకు వస్తేనే..నష్టాల్లో కూరుకుపోయిన విశ్వప్రసాద్ కోలుకుంటారు.మరి ఆయన రాజీకి వస్తారో లేదో చూడాలి.

రీసెంట్‌గా ఇల్లు అమ్మేసిన జగపతి బాబు.. ఏం జరిగింది? ఎందుకమ్మేశారు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus