జగపతిబాబు.. ఇప్పటి తరం వాళ్లకు ఆయనో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుసు. మంచి మంచి పాత్రలు చేస్తూ వెర్సటైల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నిలుస్తున్నారు. నిన్నటి తరం వాళ్లకు అయితే ఆయన ఫ్యామిలీ స్టార్ హీరో. ఇద్దరు భార్యలు, ఇద్దరు లవర్స్ కాన్సెప్ట్ సినిమాలతో ఫేమస్. ఇదంతా ఆయన యాక్టర్ సైడ్. అయితే ఆయన ఆఫ్‌లైన్ విషయంలో కొన్ని విమర్శలు ఉన్నాయి. ఆయన ఫైనాన్సియల్ విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు జరిగాయి అని ఇండస్ట్రీలో అంటుంటారు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటే.. మరోసారి ఫైనాన్సియల్ టాపిక్ ఒకటి బయటకు వచ్చింది..
ప్రస్తుతం జగపతిబాబు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్ షో నిర్వహిస్తున్నాడు. ఈ షో కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్‌కి వచ్చింది. యంగ్ హీరోయిన్ శ్రీలీల వచ్చింది. ఇద్దరు మాట్లాడుతుండగా మధ్యలో జగపతిబాబు గురించి ఓ టాపిక్ వినిపించింది. ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ గురించి మాట్లాడుతుండగా ఆయన ఇల్లు అమ్మేశారు అని తెలిసింది. శ్రీలీల మాట్లాడుతూ ‘గుంటూరు కారం’ సినిమా టాపిక్ ప్రస్తావించింది. ఆ సమయంలో మీరు ఇల్లు అమ్మేస్తున్నారు అని కూడా అంది. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జగపతి బాబు ఇప్పుడు ఎందుకు ఇల్లు అమ్మేశారు. ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారా, వరుస సినిమాలు చేస్తున్నారు కదా, పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లతో కలసి పని చేస్తున్నారు. టీవీ షోలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో డబ్బుల అవసరం ఎందుకొచ్చింది అనే చర్చ జరుగుతోంది. గతంలో ఓ సందర్భంలో ఇలా ఇబ్బందిపడ్డారు. అయితే ఆ తర్వాత పూర్తిగా మారిపోయాడు. మరి ఇప్పుడు ఇల్లు అమ్మేశారు అంటే ఇంకేదైనా కారణం ఉండి ఉండాలి. చూద్దాం ఇంకేదైనా ఎపిసోడ్‌లో దీని గురించి మాట్లాడతారేమో.