రామ్ గోపాల్ వర్మ…ఈ దర్శక నిర్మాత ఎప్పుడు..ఎక్కడ ఏం జరుగుతుందో…దానిపై కధ రాసేసి, దాన్ని తెరకెక్కించేయాలనే ఆలోచనతో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. తాను తీసే సినిమాల వల్ల సమాజంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా నాకు సంభంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తు ఉంటాడు. ఇదిలా ఉంటే తాజాగా వర్మ బెజవాడ వేదికగా జరిగిన మార హోమాన్ని తనదైన శైలిలో ‘వంగవీటి’ పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అసలు వర్మ ఏం తీస్తున్నాడో అన్న సస్పెన్స్ అందరి మదిలో ఉంది. అయితే ఇదే క్రమంలో వర్మకు కొన్ని వార్నింగ్స్ సైతం అందుతూ ఉండడంతో వాటిపై వర్మ తనదైన శైలిని పక్కన పెట్టి, సీమ సంస్కృతిని తన ఆయుధంగా వాడుకుంటున్నాడు. వంగవీటి సినిమాపై కామెంట్ చేస్తూ…మళ్లీ బెజవాడలో కుల విద్వేషాలు రెచ్చగొడతావా? మళ్లీ గొడవలకు ఆధ్యంపోస్తావా అని కొందరు వర్మకు ట్వీట్ చేయగా…దానికి వర్మ కోపంతో ….తనదైన స్టైల్ లో నన్ను బెదిరుస్తున్నారా?? నేను ఎవ్వరికీ భయపడను….చూసుకుందామా అంటూ తాను 26న బెజవాడ వస్తున్నా అని, ‘డేట్, ప్లేస్..’ చెప్పేశాడు. ఫలానా విమానంలో, ఫలానా టైమ్‌కి విజయవాడలో ల్యాండ్ అయ్యి, ఫలానా హోటల్‌లో స్టే చేస్తానని కూడా వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా ‘నువ్వేమన్నా రౌడీవా.? నాకన్నా పెద్ద రౌడీ ఇంకెవరూ వుండరు.? నేనలాంటిలాంటి రౌడీని కాదు. ఆకు రౌడీలా నాకు హెచ్చరికలు పంపించేది..’ అంటూ వర్మ ట్విట్టర్‌లో ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశాడు. అసలు వర్మ ఏం చేస్తున్నాడో ఆయనకు అయినా అర్ధం అవుతుందో లేదో కానీ, అటు చేసి ఇటు చేసి ఆయన ఇబ్బందులను కొని తెచ్చుకునేలాగా ఉన్నాడు అంటున్నారు సినీ పండితులు. నిజంగా వర్మ చెప్పిన ప్లేస్ కి బెజవాడ వాళ్ళు వెళ్ళి వర్మను నిలదీస్తే వర్మ ఏం చేయగలడు. ఏది ఏమైనా వర్మ ఇలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది లేకపోతే అసలుకే మోసం వస్తుంది.