Ashu Reddy: బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి బర్త్‌డే బాష్ లో ఆర్జీవీ & సెలబ్రిటీలు!

  • September 16, 2022 / 03:16 PM IST

బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొన్న అషురెడ్డి.. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. అప్పటికే ఆమె ఒకట్రెండు సినిమాల్లో నటించింది. బిగ్ బాస్ షోలో ఆమె మరింత క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం కొన్ని టీవీ షోలు, ప్రమోషన్స్ తో కాలం గడుపుతుంది. ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 15న ఈ బ్యూటీ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఈ వేడుకల్లో రామ్ గోపాల్ వర్మ, హరితేజ, మెహబూబ్, నటి హేమ ఇలా చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. వర్మ అయితే దగ్గరుండి మరీ అషుతో కేక్ కట్ చేయించారు.

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆర్జీవీతో అషురెడ్డికి ఉన్న బంధం గురించి తెలిసిందే. వీరిద్దరూ కలిసి గతంలో చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది. ఇక అషురెడ్డి తండ్రి అయితే బర్త్ డే సందర్భంగా ఆమెకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. మెర్సిడెజ్ జీఎల్‌సీ 200డీ మోడల్ కారును తనకు బహుమతిగా అందించారు అషురెడ్డి తండ్రి. ఈ కారు ఎక్స్-షోరూం ధర రూ.73.5 లక్షల వరకు ఉంటుంది. ట్యాక్స్‌లు, యాక్సెసరీస్- అన్నీ కలుపుకొని రూ.90 లక్షల వరకు దీని ధర ఉండే అవకాశం ఉంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus