Rishab Shetty, Ram Charan: మల్టీ టాలెంటెడ్ రిషబ్ తో మెగా మేకర్ సాలిడ్ ప్లాన్..!

’కాంతార‘ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో మరోసారి కన్నడ ఇండస్ట్రీ పేరు మారుమ్రోగేలా చేసాడు రిషబ్ శెట్టి.. ‘కె.జి.యఫ్’ తో ఎలాగైతే రాకింగ్ స్టార్ యశ్ సెన్సేషన్ క్రియేట్ చేసాడో దానికి డబుల్ ఇంపాక్ట్ తెచ్చుకున్నాడనే చెప్పాలి.. ఎందుకంటే హీరో, డైరెక్టర్ రెండూ తనే కాబట్టి.. గత వారం రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో ‘కాంతార’ కథ గురించి, రిషబ్ శెట్టి గురించి రకరకాల వార్తలు వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం.

రిషబ్ కి సినిమా అంటే ఎంత ప్యాషన్ అంటే.. నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా, రచయితగానూ కన్నడ పరిశ్రమలో అతి తక్కువ టైంలో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలుగులో ‘కాంతార’ సినిమాని విడుదల చేశారు. జనరల్ అరవింద్ ఎక్కడుంటే అక్కడ అదృష్టం ఉంటుంది అంటుంటారు. అలాగే ఈ మూవీ కొన్న దానికంటే ఎన్నిరెట్లు ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుందో ఆయనకే తెలుసు. ‘కాంతార’ సక్సెస్ మీట్ లో అరవింద్ తమ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రిషబ్ శెట్టి ఓ సినిమా చెయ్యబోతున్నాడని చెప్పారు.

సొంత సంస్థ కాబట్టి కొడుకు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ తో ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నారేమోలే అనుకుంటే.. సర్ ప్రైజింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. అరవింద్, రిషబ్ ని లాక్ చేసింది మేనల్లుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసమంట.. ఓ సాలిడ్ స్టోరీ రెడీ చేస్తే.. పాన్ ఇండియా రేంజ్ లో భారీగా ప్లాన్ చేద్దామని రిషబ్ తో చెప్పారట అరవింద్. ఈలోగా ’కిరాక్ పార్టీ 2’ కంప్లీట్ చేసి, చరణ్ కోసం కథ రాసే పని మొదలు పెడతారని అంటున్నారు.

ట్రిపులార్ తో నార్త్ లో గుర్తింపు తెచ్చుకున్న చెర్రీ, శంకర్ డైరెక్షన్లో పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాడు. రిషబ్ ‘కాంతార’ తో పాన్ ఇండియా స్థాయిలో వార్తల్లో నిలిచాడు. సో, వీళ్లిద్దరి క్రేజీ కాంబినేషన్ లో ఓ సాలిడ్ సినిమా చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? ఇండియన్ ఇండస్ట్రీ షేకవుతుంది.. పాన్ వరల్డ్ రేంజ్ లో హైప్ వస్తుంది అనేది అరవింద్ ఆలోచన.. ఈ న్యూస్ బయటకి రావడంతో.. ‘‘గతేడాది అన్ స్టాపబుల్ లాంఛింగ్ ఈవెంట్ లో బాలయ్య, అరవింద్ ని ఉద్దేశించి చేసిన మాటలు గుర్తున్నాయిలే’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus