సరసానికి పోయి నవ్వులపాలయ్యాడు.!

ఒక్కోసారి సీనియర్ నటులు చేసే చిలిపి పనులు వాళ్ళకు మాత్రమే కాదు వాళ్ళ కుటుంబ సభ్యుల పరువు కూడా పోగొట్టేలా ఉంటాయి. ఇటీవల సోనమ్ కపూర్ వెడ్డింగ్ కు అటెండ్ అయిన రిషి కపూర్ ఆ వేడుకలో సల్మాన్ మరదలు సీమీఖాన్ తో అసభ్యంగా ప్రవర్తించాడట. బాలీవుడ్ కి చెందిన ప్రముఖులందరూ హాజరైన ఈ వేడుక అత్యంత ఘనంగా నిర్వహించబడింది. రిసెప్షన్ అనంతరం జరిగిన ఆఫ్టర్ పార్టీలో రిషి కపూర్ భార్య నీతూతో సహా హాజరయ్యాడు. అక్కడ అందరితో సరదాగా డ్యాన్స్ చేస్తూ చేస్తూ.. అదే సమయంలో ఆ పక్కగా డ్యాన్స్ చేస్తున్న సీమీఖాన్ వద్దకు వచ్చి, అక్కడ ఆమెతో డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించాడట.

పార్టీ కల్చర్ లో భాగం కాబట్టి డ్యాన్స్ ను కాదనలేకపోయిన సీమీఖాన్ ను తాకారాని చోట తాకడానికి ప్రయత్నించాడట రిషి కపూర్. ముసలాడి చేష్టలకి కోపోద్రిక్తురాలైన సీమీఖాన్ అక్కడ అందరి ముందు ఏమీ అనలేక, సైలెంట్ గా అక్కడ్నుంచి వెళ్ళిపోయి ఆ విషయాన్ని సల్మాన్ ఖాన్ కి చెప్పిందట.వెంటనే సల్మాన్ పార్టీ ప్లేస్ కీ రిషి కపూర్ కోసం రాగా.. అప్పటికే ఋషి కపూర్ మెల్లగా జారుకున్నాడని తెలిసింది. రిషి కపూర్ చేసిన సిగ్గుమాలిన పనికి ఆయన సతీమణి నీతూ చేతులెత్తి సల్మాన్ ఖాన్ కి క్షమాపణలు చెప్పిందట. వయసులో పెద్దావిడ అలా ప్రాధేయపడేసరికి సల్మాన్ సైలెంట్ గా వెళ్లిపోయాడట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus