గూఢచారిని వదులుకున్నందుకు పశ్చాతాపపడుతున్న రీతూ వర్మ!

దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లిచూపులు సినిమా ద్వారా రీతూ వర్మ హీరోయిన్ గా బ్రేక్ అందుకుంది. ఈ మూవీ విజయం సాధించడంతో అనేక అవకాశాలను సొంతం చేసుకుంది. తెలుగులో కేశవ సినిమాతో పాటు మూడు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. తన కెరీర్ జోరుగా దూసుకుపోతున్నప్పటికీ రీతూ వర్మ బాధపడుతోంది. అందుకు కారణం గూఢచారి. యువ దర్శకుడు శశికాంత్‌ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి షో నుంచి మంచి టాక్ తో దూసుకుపోతోంది. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకం పై అభిషేక్‌ నామా నిర్మించిన ఈ సినిమాలో అడవి శేషు అదరగొట్టారు.

ఇందులో అతనికి జోడీగా నటించమని ముందుగా రీతూ వర్మని అడిగారట. రీతూ కూడా ఓకే చెప్పిందట. షూటింగ్‌ మొదలయ్యే సమయానికి కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. దాంతో ఆ క్యారెక్టర్‌ కోసం శోభిత ధూళిపాలను తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా బాగా ఉందని అందరూ ప్రశంసిస్తుంటే..  మంచి సినిమాని వదులుకున్నందుకు రీతూ బాధపడుతోందని తెలిసింది. పైగా ఈ సినిమా తన కెరీర్ కి మంచి మైలేజ్ ని ఇచ్చేదని భావిస్తోంది. ఇటువంటి కథలను మరోసారి వదులుకోకూడదని నిశ్చయించుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus