Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కరుప్పు’. తెలుగులో కూడా ఈ తమిళ పేరుతోనే సినిమాను విడుదల చేస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా టైటిల్‌ కార్డ్స్‌లో సూర్య పేరు బదులు వేరే హీరో పడాలి. ఈ విషయాన్ని దర్శకుడు ఆర్జే బాలాజీనే చెప్పుకొచ్చారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే విజయ్‌ పేరు టైటిల్‌ కార్డ్స్‌లో వచ్చేదని చెప్పాడు. వివిధ కారణాల వల్ల ప్రాజెక్ట్‌ ఆయన చేతి నుండి సూర్యకు వచ్చిందని చెప్పుకొచ్చారు.

Rj Balaji

కోలీవుడ్‌ నటుడు ఆర్జే బాలాజీ ‘మూకుతి అమ్మన్‌’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి’) సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ సినిమా ఓటీటీలో వచ్చి మంచి టాక్‌ సంపాదించుకుంది. ఆ తర్వాత ‘వీట్ల విశేషం’ అనే మరో సినిమాను కూడా తెరకెక్కించారు. ఈ రెండు సినిమాను సోలోగా కాకుండా ఎన్‌.జె.శరవణన్‌తో కలసి తెరకెక్కించారు. ఇప్పుడు తొలిసారి ‘కరుప్పు’తో పూర్తి స్థాయి దర్శకుడిగా మారబోతున్నారు. సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా మే 14న విడుదల కానుంది.

ఈ సినిమా గురించి ఇటీవల ఆర్జే బలాజీ మాట్లాడుతూ విజయ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నా సాధ్యపడలేదని చెబుతూ.. అసలేమైందో తెలిపారు. ‘కరుప్పు’ కథను 2023లో రాయడం ప్రారంభించానని, రాస్తున్న కొద్దీ విస్తృతి పెరిగింది. దీంతో సినిమాలో హీరోగా స్టార్‌ హీరో అయితేనే బాగుంటుందని అనుకున్నానని తెలిపారు. వెంటనే విజయ్‌ను కలిసి స్క్రిప్టు వినిపించానని, షూటింగ్‌ వెంటనే ప్రారంభించగలవా అని ఆయన అడిగారని చెప్పారు.

అయితే అప్పటికి సినిమాను తెరకెక్కించడానికి ఇంకొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉండటంతో కొంత సమయం కావాలని చెప్పానని బాలాజీ తెలిపారు. ఆ తర్వాత విజయ్‌ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ సినిమాలో నటించలేకపోయారు అని తెలిపారు. అయితే సూర్యను సినిమాలో హీరోగా ఎంపిక చేశాక.. ఆయన ఇమేజ్‌కి తగ్గట్లు హీరో పాత్రలో కొన్ని మార్పులు చేశానని తెలిపారు.

నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus